నేనొక్కడినే ట్యాగ్ లైన్ లేపేశారట
ప్రిన్స్ తన కొత్త సినిమా వన్ పై స్పందించాడు. శుక్రవారం తన తండ్రి బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చిందని, ఫస్ట్ లుక్ ఈ రేంజ్ లో ఫ్యాన్స్ కి నచ్చుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదని అన్నారు. సినిమా కూడా ఇదే రేంజ్ లో వుంటుందని, సుకుమార్ నన్ను సరికొత్తగా చూపిస్తాడని ట్వీట్ చేశాడు. నిజానికి చాలా రోజులుగా తరువాత ట్విటర్ తో ప్యాన్స్ ని పలకరించాడు.
అయితే సినిమా టైటిల్ జనాల్లోకి సరిగ్గా వెల్లలేదని ....టీజర్ లో డైలాగ్స్ లేకపోవడం ప్యాన్స్ ని కాస్త నిరుత్సాహపరిచిందని ప్రిన్స్ ఫీలవుతున్నాడట.
అందరూ కూడా టైటిల్ నేనొక్కడినే అనుకుంటున్నారని... టైటిల్ వన్ కదా.? మరి ట్యాగలైన్ గా పెట్టిన నేనొక్కడినే పదాన్ని ఇప్పుడే పోస్టర్ పై ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సుకుమార్ తో అన్నట్టు ఫిల్మ్ నగర్ కబర్. దీంతో సుకుమార్ ట్యాగ్ లైన్ నేనొక్కడినే తీసేసి ఒన్ మాత్రమే వుండేలా పోస్టర్స్ డిజైన్ చేయిస్తున్నాడట. త్వరలోనే ఆ స్టిల్స్ జనాల్లోకి వదలాలని ప్లాన్ చేస్తున్నారట.