పాఠాలు మొదలు పెట్టిన అసిన్ !!!
ఏడు నెలల సస్పెన్స్ కు అసిన్ బ్రేక్ చేసింది ఆ మధ్య ప్రభుదేవా తో ప్రేమాయణం సాగిస్తోంది, కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయి ని పెళ్ళి చేసుకోబోతోంది అనే రూమర్ లకు తెర దించుతూ ఈ 100 కోట్ల హీరోయిన్ అభిషేక్ బచన్ తో ఒక కామెడి ఎంటర్ టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కెరియర్ పరంగా బాలీవుడ్లో హౌస్‌ఫుల్, బోల్‌బచ్చన్, ఖిలాడి 786లో నటించింన అసిన్ ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు తగ్గిపోవడంతో ఎత్తుపల్లాలు సహజమేననీ, ఒక్కోసారి కెరియర్ వూపందుకుని గ్యాప్ రావడం మామూలేనని చెబుతోంది ఈ చెన్నై బ్యూటి .
ఆమె ప్రాంతీయభాషలను నేర్చుకుని తన చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పుకుంటోంది. తమిళ్, తెలుగు, హిందీ చిత్రాల్లో తన వాయిస్ వినిపిస్తోంది. అయితే లేటెస్ట్గా అసిన్ జర్మనీ భాష కూడా నేర్చుకుంటోoదట. రజనీకాంత్‌లా ప్రపంచభాషల్లో తన సినిమాలు ఉండేలా చూసుకుని పేరు తెచ్చుకోవాలని అనుకుంటుందేమో... చూడాలి.