ఐరెన్ మ్యాన్ రేంజులో..అల్లరి నరేష్ సినిమా!
. ఐరెన్మ్యాన్, లైఫ్ ఆఫ్ పై సినిమాల కంటే... ఇందులో బెస్ట్ అవుట్ పుట్ ఉంటుందని నరేష్ చెబుతున్నారు. ఈ యాక్షన్ త్రీడీకి హాలీవుడ్ నిపుణుడు కీత్ పనిచేశారు. ఆయనతో పాటు దాదాపు 20 మంది టెక్నీషియన్లు త్రీడీ ఎఫెక్టుల కోసం శ్రమించారట. ప్రేమయుద్ధం సినిమాలోని స్వాతి ముత్యపు జల్లులలో పాటని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. వీటి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ... 14 వరకూ ఆగాల్సిందే.