వీరప్పన్ మళ్లొచ్చాడు!
ఆధారంగా అటు తమిళంలోనూ, ఇటు కన్నడంలోనూ కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వీరప్పన్ మరణం తరవాత కూడా అతని కథ సినిమాలకు పనికొస్తోంది. తమిళంలో వీరప్పన్ జీవితంపై ఓ సినిమా తీశారు. అదే.. వాన యుద్ధం. అర్జున్ కథానాయకుడు. వీరప్పన్ గా కిషోర్ నటించారు.
లక్ష్మీరాయ్ కథానాయిక. వీరప్పన్‌తో పరిచయం ఉన్నవాళ్లందరినీ వ్యక్తిగతంగా కలుసుకొని.. వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి వాస్తవాలకు దగ్గరగా రూపొందించిన సినిమా ఇది. రమేష్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.