లక్ష్మీ ప్రసన్న లేకుండా ఎలా..?
ఇదే అనుమానం శ్రీవాస్‌కి వచ్చిందట. ``సార్ అమ్మాయిగోరు లేకపోతే... ఎట్టా..??`` అని మోహన్ బాబు దగ్గర తన అనుమానాన్ని బయటపెట్టాడట. వెంటనే లక్ష్మీ ప్రసన్నని కూడా రంగంలోకి దించేశారు.ఈ మంచువారి ఫ్యామిలీ ప్యాక్‌లో ఇప్పుడు.... లక్ష్మీ ప్రసన్న కూడా చేరిపోయింది. ప్రస్తుతానికి ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది ప్రసన్న. ఆ షూటింగ్ పూర్తయ్యాకే ఫ్యామిలీ సినిమాలో పాల్గొంటుందట. అయితే ప్రత్యేక పాత్రలోనే.
ఒక సన్నివేశంలో మాత్రం మంచు వారంతా గుంపుగా కనిపిస్తారట. ఆ సన్నివేశం.. భలే థ్రిల్లింగ్ గా ఉండబోతోంది... అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రణీత, హన్సిక, రవీనా టాండన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఇటీవలే ఓ షెడ్యూలు కూడా పూర్తిచేసుకొంది.