పవన్ ఎంట్రీ అదిరిపోతుందట
, బాంబు బ్లాస్టింగులులతో పవన్ ఓపెనింగ్ సీన్ అదిరిపోయే స్థాయిలో ఉంటుందట. దీని కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చుపెట్టారట. ఈ పోరాట దృశ్యాలను డిజైన్ చేసిందెవరో కాదు. స్వయంగా దర్శకుడు త్రివిక్రమ్. ప్రస్తుతం స్పెయిన్లో ఇందుకు సంబంధించిన యాక్షన్ ఘట్టాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ సన్నివేశాలలో వచ్చే ఫైట్ ఇది.
ఓపెనింగ్ సీన్ ఇంత భారీ ఎత్తున ఉంటే, మరి పతాక సన్నివేశాలో...? అని అభిమానులు అప్పుడే ఆశల్లో మునిగిపోతున్నారు. పవన్ ఎంట్రీ ఏ స్థాయిలో ఉంటుందో, అభిమానుల్ని ఎంతలా ఉర్రూతలూగిస్తుందో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాలి.