‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ అదుర్స్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మెగా, నందమూరి అభిమాను పంట పండిందనే చెప్పాలి.  దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఇక నందమూరి నటసింహం తన 100 వ చిత్రంగా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందించబడిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’గా అభిమానుల ముందుకు వచ్చారు.  

అయితే ఈ రెండు చిత్రాలు పోటా పోటిగా విజయాలు సాధించాయి.  తెలుగు వారి రోషం, మీసం మెలేస్తూ ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి దశదిశలా చాటి చెప్పిన గోప్ప యోధులు గౌతమి పుత్ర శాతకర్ణీ చిత్రంతో నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు కిన్నులైపోయారు.  

రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ రావడం..రెండు తెలుగు రాష్ట్రాలలో పది కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం .

బాలకృష్ణ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధిస్తోంది గౌతమిపుత్ర శాతకర్ణి .   ఒక్క రోజులోనే తెలుగులోనే పది కోట్ల కు పైగా షేర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు..బాలకృష్ణ నటించిన అన్ని చిత్రాల్లోకంటే  ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందని బాలయ్య అభిమానులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: