తాతయ్య పేరు నిలబెడుతాం : ఎన్టీఆర్

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన మహానటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు నందమూరి తారక రామారావు 21 వ వర్థంతి నేడు.  ముగ్ధమోహనరూపంతో, పాత్రోచితమైన ఆహార్యం, వాచికాలతో నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడేమో అని ఊహాల్లోకి తీసుకు వెళ్ళగల శక్తి ఒక్క ఎన్టీఆర్ కు తప్ప మరెవ్వరికీ లేదు. తన నటనతో భారతీయ సినిమా రంగంలో ఒక అధ్యాయాన్ని శాశ్వతంగా ఏర్పరుచుకున్నారు నందమూరి.

1953లో ‘ఇద్దరు పెళ్ళాలు’ సినిమాలో మూడుపదుల వయసులో ఓ స్వప్నగీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించిన ఎన్టీఆర్ అప్పటి నుంచి తన యాభై ఆరేళ్ళ వయసులో నటించిన ‘శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ దాకా ఇరవై ఏడేళ్ళ వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడంతో నందమూరి తారకరామారవును ఒక చరిత్ర సృస్టించిన మహోన్నత నటుడిగా తీర్చిదిద్దింది. పాత్రలలో లీనమై నటించడమే కాదు. ఆ పాత్రలను తన నిజజీవితానికి ఆపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.

వెండితెర జీవితం మొదలుకొని రాజకీయాల వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఆయన సాధించినన్ని విజయాలు భారతదేశంలో మరే నటుడు సాధించ లేకపోయాడు అన్నది వాస్తవం.  నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ చిరస్థాయిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు.

ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని తెలిపారు.   నందమూరి కుటుంబ సభ్యులు తాతయ్య పేరు నిలబెడతాం అని ఆయన ఆశయాలు నెరవేర్చడానికి తాము ఎప్పుడూ కృషి చేస్తామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: