కాటమరాయుడుకి శాపంగా మారుతున్న ఖైదీ నీలి నీడలు !

Seetha Sailaja
చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ విడుదలై కలక్షన్స్ వాన కురిపిస్తున్న నేపధ్యంలో దాదాపు 10 సంవత్సరాలు తరువాత తిరిగి ఒక మాస్ సినిమాలో నటించిన చిరంజీవి తన మాస్ ఇమేజ్ ఏమిటో టాలీవుడ్ కు అర్ధం అయ్యేలా చేసాడు.  తాను రాజకీయ రంగంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ సినిమా రంగంలో తాను ఇప్పటికీ మెగా స్టార్ నే అని రుజువు చేస్తూ తాను నటించిన సినిమాను చూడటానికి జనం గుంపులు గుంపులుగా వస్తారని తన క్రేజ్ ను మరొకసారి నిరూపించుకున్నాడు చిరంజీవి. 

ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవికి పెరిగిన క్రేజ్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ కి శాపంగా మారుతుందా అన్న విశ్లేషణలు ఫిలింనగర్ లో మొదలయ్యాయి. చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళి తన మెగా స్టార్ ఆదిపత్యాన్ని కోల్పోయే పరిస్థుతులు ఏర్పడినప్పుడు టాలీవుడ్ ఎంపరర్ గా పవన్ కళ్యాణ్ అవతరించడంతో చిరంజీవి స్థానాన్ని పవన్ భర్తీ చేస్తాడు అని అనుకున్నారు మెగా అభిమానులు అంతా. 

అయితే పవన్ తన క్రేజ్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లాంటి అనవసరపు సినిమా చేసి పవన్‌ ఒక తప్పటడుగు వేయడమే కాకుండా ఇప్పుడు 'కాటమరాయుడు' అనే నాసిరకం రీమేక్‌తో వస్తున్నాడు. ఈ చిత్రం పట్ల ఫాన్స్‌కి కూడా ఉత్సాహం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో ‘కాటమరాయుడు’ కు  సినిమాకు అనుకోకుండా నెగిటివ్ టాక్ వస్తే అది పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం మంచిదికాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ కు వీరాభిమానులుగా ఉన్నవాళ్ళు కూడ పవన్ నుంచి నెమ్మదిగా జారుకునే అవకాసం ఉంది అని అంటున్నారు.  దీనికితోడు పవన్‌ కళ్యాణ్‌ అన్నయ్యకి అవసరమైన టైమ్‌లో సపోర్ట్‌ ఇవ్వలేదనే ఫీలింగ్‌ పవన్ వీరాభిమానులలో కూడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 

ముఖ్యంగా చిరంజీవి పుంజుకున్న టైమ్‌లో పవన్‌ కళ్యాణ్ మూవీ ఫ్లాప్ అయితే దానికి భారీ మూల్యం పవన్ చెల్లించుకోవలసి వస్తుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  దీనికితోడు పవన్ కు అల్లు అరవింద్ కు సరైన సంబంధాలు లేకపోవడం మెగా ఫ్యామిలీలో కూడ పవన్ అనుబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ‘కాటమరాయుడు’ కు చాల ఎదురీత ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: