తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానం సంపాదించిన గాయకులు ఎస్పీబాలసుబ్రమాణ్యం.  మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. 1966లో నటుడు, నిర్మాతా అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయన ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయన గళానికి వుంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు.

గాన గంధర్వుడిగా పేరు తెచ్చుకున్న బాలు ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు.  తాజాగా ఆయన తెలుగు హీరోలపై పెను సంచలన వ్యాఖ్యలు చేశారు.   క్క హీరో కూడా దేశం కోసం కానీ భాష కోసం కానీ ఒక్క సినిమా కూడా చేయలేదని అందరు హీరోలను విమర్శించాడు . విజయవాడ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు జీవన సాఫల్య పురస్కారం అందించారు .  ఈ సందర్భంగా ఆయన తెలుగు హీరోలు ఎప్పుడూ కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చారని అందుకోసమే ఇప్పటి వరకు పెద్ద అవార్డులు ఏవీ రాలేదని విమర్శించారు.  

జాతి కోసమో , భాష కోసమో సినిమా చేస్తే కేంద్ర ప్రభుత్వ అవార్డులు వస్తాయి కానీ కమర్షియల్ సినిమాలు చేస్తే రావని ఛలోక్తులు విసిరారు.  ఇక మిధునం చిత్రానికి మంచి చిత్రమని ప్రశంసలు లభించినప్పటికీ దానికి థియేటర్ లు దొరకలేదని ,పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు చిన్న సినిమాలను తీసి పక్కన పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ అభిమాన హీరోలకు అవార్డులు రావాలంటే ముందు ఫ్యాన్స్ వారిని ప్రశ్నించాలని సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: