జగపతిబాబు ఎవరిని కలిసాడు ...??

K Prakesh

ఫ్యామిలీ హీరో శోభనబాబు తరువాత ఆస్థాయి హీరోగా గుర్తింపు పొందిన హీరో జగపతి బాబు. మారిపోయిన కాలంలో ప్రస్తుతం ఈయనకు చెప్పుకోతగ్గ సినిమాలు లేవు. కానీ ఈ మధ్య జగపతిబాబు  జైలుకు వెళ్లి వార్తల్లోకి వచ్చాడు. అదేమిటి అనుకుంటున్నారా? ప్రస్తుతం మన ఏపీలో చంచల్ గూడ జైలు సందర్శన ఒక టూరిజం స్పాట్ గా మారిపోయింది. ప్రముఖులు ఎవరైనా చంచల్ గూడ జైలును సందర్శించారంటే, అది మీడియాకు హాట్ టాపిక్కే.  ఈ నేపథ్యంలో జగపతి బాబు కూడా చంచల్ గూడజైలును సందర్శించారు.

అక్కడ ఉన్న వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను జగపతి బాబు మాట్లాడి వచ్చారని తెలుస్తోంది. మరి నిమ్మగడ్డకూ, జగపతి బాబుకు ప్రత్యేకమైన సంబంధాలు ఏమైనా  ఉన్నాయా? అంటే...అది లోలోపలి బంధాలే అని అనుకోవాలి. అయితే జగపతి బాబు జైల్లో కేవలం నిమ్మగడ్డనే కలిశాడా? లేక జగన్ నుకూడా పలకరించివచ్చాడా? అనేది తెలియరాలేదు.

ఒకవేళ జగపతి జగన్ ను కలుసుకుని ఉంటే...అది మరింత ఆసక్తికరమైన అంశం! ఇదే జరిగి ఉంటే ప్రస్తుతం హీరోగా అవకాశాలు అంతగా లేని జగపతి బాబు రాజకీయాలపై దృష్టి సారించాడని అనుకోవాలి. తను నటించిన సినిమాలు ఎలాగు సరిగా ఆడటం లేదు కాబట్టీ రాజకీయాలే బెటర్ అని జగపతి అనుకుంటున్నాడెమో....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: