తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘ఇడియట్’ చిత్రంతో దర్శకుడిగా మారిన పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు. యూత్ ఫుల్ ఎంట్రటైన్ మెంట్ తో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'. 'మరో చంటిగాడు ప్రేమకథ' క్యాప్షన్.
ఈ చిత్రం జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ బ్యానర్‌పై డా.సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ వాలెంటెన్స్ డే సందర్భంగా విడుదలైంది. ఎప్పుడూ కొత్త హీరో, హీరోయిన్లను పరిచయం చేస్తూ వచ్చే పూరి ఈ సారి ఇషాన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా లావిషింగ్, స్టయిలిష్ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్ లుక్కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రాబట్టుకుంది. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌కు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్, ఆర్ట్: జానీ షేక్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, మ్యూజిక్: సునీల్‌కశ్యప్, సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్.