ముగ్గరు హీరోయిన్స్ మీదపడ్డా తప్పుకున్నాడు
ఇదిలా ఉంటే ఇక విన్నర్ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ కి నాగబాబు, ధరమ్ తేజ్ అమ్మ, పిన్నిలు హాజరవడం విశేషం. అయితే సాయిధరమ్ తేజ్ ని నిజ జీవితంలోనూ, సినిమా జీవితంలో తనని ఎక్కువుగా ప్రభావితం చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని స్సష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ… గెలుపంటే అసలైన అర్థమేమిటో పవన్ కళ్యాణ్ నేర్పించారని అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిధరమ్ తేజ్ పై ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా హీరోయిన్స్…హీరోలను టార్గెట్ చేసుకొని డేటింగ్ ఆఫర్ చేస్తే ఏ హీరో మాత్రం కాదనగలడు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ అంతా ప్రముఖ హీరోలతో ప్రత్యేక సందర్భాల్లో డేటింగ్ చేసినవాళ్ళే ఉన్నారని అంటారు. ఆ విధంగానే సాయిధరమ్ తేజ్ కి సైతం ఇప్పటి వరకూ 3 హీరోయిన్స్ డేటింగ్ ప్రపోజల్స్ ని పెట్టారట. అంతటితో ఆగకుండా ఆ ముగ్గురు హీరోయిన్స్ కొన్ని సందర్భాల్లో సాయిధరమ్ తేజ్ ని తెగ హింసించేవారట.
అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం ఆ ముగ్గురు హీరోయిన్స్ ఆఫర్ చేసిన డేటింగ్ ని పక్కన పెట్టడమే కాకుండా…వారికి కొంత కాలం పాటు దూరాన్ని మెయింటెన్ చేశాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. సాయిధరమ్ తేజ్ మంచి వాడనే విషయం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. కానీ హీరోయిన్స్ మీదపడ్డా పక్కకి తప్పుకునేంత మంచివాడని తెలియటంతో మెగాఫ్యామిలీ అంతా షాక్ అయ్యారంట. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ మూవీ ఈ నెల 24న రిలీజ్ కానుంది.