యంగ్ టైగర్‌ను చుట్టేస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ రామయ్యా..వస్తావయ్యా. ఎన్టీఆర్ మూవీను అనుకున్నదానికంటే ముందుగా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. గబ్బర్‌సింగ్ మూవీకు 10నెలల టైం తీసుకున్న హరీష్ శంకర్, ఎన్టీఆర్ మూవీకు అంత సీన్ ఇవ్వటం లేదు. ఇది హరీష్‌శంకర్‌కు రెండో మూవీ అయినా, ఎంత మాత్రం జాగ్రత వహిచటంలేదు. షూటింగ్ పనులు శరవేగంగా జరుపుతూ త్వరలోనే పేకప్ చెప్పే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్.
ఈ మూవీను మొదటగా ఆగష్టు 7 న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆదే రోజు పవన్ కళ్యాణ్ అత్తారింటిదారేది రిలీజ్ ఉండటంతో, ఒక నెల తరువాత దాన్ని సెప్టంబర్ 27కి మార్చారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వచ్చి, సెప్టంబర్ 17కి మారుతుంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌తో రీటేక్లను అసలు చేయించడంలేదు. మొదటి షాట్‌కే ఓకే చెప్పిస్తున్నాడట. చిత్ర యూనిట్లో మాత్రం హరీష్ మూవీను భలే చుట్టేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
అసలే లెక్క,దానితో తిక్క అంటూ ఎంట్రి ఇచ్చిన డైరెక్టర్ కదా, ఈ చుట్టుడుకి ఉన్న లెక్కేంటో రిలీజ్ రోజు చూపిస్తానని హరీష్‌శంకర్ థీమా వ్వక్తం చేస్తున్నాడు.