సుధీర్ బాబు హీరోయిన్ పై రామ్ చరణ్ కన్ను

SK
ఇటీవలే ప్రేమకథా చిత్రంలో సుధీర్ బాబు సరసన హీరోయినుగా నటించి హిట్ క్రెడిట్ మొత్తం తనదే అనిపించుకున్న హీరోయిన్ నందితపై మెగా పవర్ హీరో రామ్ చరణ్ కన్ను పడినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు సినిమా చూసిన ప్రతి ఒక్కరుఫీదాఅయిపోయారు. అంతలా నందిత తన అభినయంతో ఆకట్టుకుంది.

నందిత మత్తులో పడిన వారిలో రామ్ చరణ్ కూడా ఉండటం విశేషం. నందిత నటనకు ఎంతో ఇంప్రెస్ అయిన చరణ్ వెంటనే ఈ తెలుగు అమ్మాయికి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. వాస్తవానికి సుదీర్ బాబు సినిమా హీరోయిన్ అనే కంటే డైరెక్టర్ తేజ హీరోయిన్ అంటేనే నందితకు మంచి వేల్యూ ఉంటుంది. ఎందుకంటే నీకు నాకు డాష్ డాష్  సినిమా హిట్ కాకపోయినా నందిత ను ఆ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజానే.

 

తేజా స్కూల్ నుండి వచ్చిన ఏహీరో అయినా, హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారనేది అందరికి తెలిసిన విషయమే. కానీ 3వ సినిమాతోనే మెగా హీరోల కంటిలో పడటం అంటే మామూలు విషయం కాదు. ఏదిఏమైనా నందిత లక్కీ గాళ్ కదా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: