సెన్సార్ రిపోర్ట్ : ‘కాటమరాయుడు’ కి ‘యూ’ సర్టిఫికెట్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాగా ‘గోపాల గోపాల’ అద్భుత విజయం సాధించింది.  ఈ చిత్రంలో పవన్ కళ్యాన్, విక్టరీ వెంకటేష్ లు పోటా పోటీగా నటించారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గోపాల గోపాల చిత్రం సెన్సేషన్ హిట్ కావడంతో మరోసారి డాలీతో సినిమా తీయాలనుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఇక సర్ధార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత తన నెక్ట్స్ సినిమా అద్భుతమైన విజయం సాధించాలనే పట్టుమీదు ఉన్న పవన్ కళ్యాన్ తమిళంలో అజిత్ నటించిన ‘వీరం’ చిత్రాన్ని రిమేక్ గా ‘కాటమ రాయుడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, మేకింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఎటువంటి కట్స్ లేకుండా ''యు '' సర్టిఫికెట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు . ఎందుకంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా పైగా శృతి హాసన్ హీరోయిన్ అయినప్పటికీ క్లీన్ యు రావడం ఒకింత ఆశ్చర్యమే.

సినిమా మొత్తం రన్ టైమ్ 144 నిముషాలు ఉన్నట్లు టాక్. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ హైలైట్‌గా చెబుతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగానే పండినట్టు యూనిట్ మాట. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ముగ్గురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్‌ కనిపించనున్నాడు. ఇప్పటికే ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుతున్నారు. 

మరోవైపు నిర్మాత, పవన్ క్లోజ్‌ఫ్రెండ్ బండ్ల గణేష్ సెన్సార్ రిపోర్ట్ చాలా గొప్పగా వచ్చిందని, బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ప్రకటించాడు.  అంతే కాదు త్వరలో శిల్పకళా వేదికగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . గత ఏడాది రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కావడంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: