పవన్ ని ఎంతమాట అన్నాడో తెలుసా..!

Edari Rama Krishna
తెలుగు,హిందీ ఇండస్ట్రీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినీ వదలని వర్మ మెగా ఫ్యామిలీపై కాస్త ఎక్కువగానే సెటైర్లు వేస్తుంటారు.  ఆ మద్య పవన్ కళ్యాన్ గురించి తాను ఎలాంటి కామెంట్లు చేయనని మాట ఇచ్చిన వర్మ అబ్బే నేను మాట మీద నిలబడే వ్యక్తిని కానని అన్నాడు.  అంతే కాదు ఈ మద్య పవన్ కళ్యాన్ పై విపరీతంగా కామెంట్స్ పెడుతూ హల్ చల్ చేస్తున్నారు.

తాజాగా మళ్లీ తన ట్వీట్లతో వార్తల్లోకి వచ్చాడు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.  పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో పూరించాలని వర్మ కామెంట్ పెట్టాడు.  'అతడు దేవుడని నేను ఎల్లప్పుడు నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను 'పీకే'తో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో ట్విటర్ వేదికగా వర్మ కామెంట్లు పెట్టారు.  మొత్తానికి పవన్ ని తిడుతున్నాడో..పొగుడుతున్నాడో తెలియకుండా వర్మ తనదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్నాడు. 


I always believed he's God and I truly think Balaji,yadagirigutta swamy,Bhadrachalam Ramudu etc Gods should be replaced with P K pic.twitter.com/IhqtSz08G0

— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: