ఒకే వేదికపై తెలుగు హీరోల సందడి..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో  ఇప్పటి వరకు సీనియర్ హీరోలు, యంగ్ హీరోల మద్య వివాదాలు జరగలేదు..తామంతా ఒకే కుటుంబ అంటూ చాటిచెబుతున్నారు.  కొన్ని సార్లు హీరోల అభిమానుల చేస్తున గొడవల వల్ల మాటల యుద్దం సాగినా..చివరికి తెలుగు ఇండస్ట్రీ పెద్ద వృక్షం అయితే ఆ చెట్టునీడన ఉండేవారంతా ఒక్కటే అని సరిపెట్టుకుంటారు.  కాకపోతే అప్పుడప్పుడు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో గొప్ప అంటే..తమ హీరో గొప్ప అని తెగ పొగిడేసుకుంటారు.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది..వీరిలో కొద్ది మంది మాత్రం ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు ఉన్నారు.

 ఈ సంవత్సరం ‘ఉగాది’ పండుగ ప్రత్యేకత సంతరించుకోబోతుంది..అవును టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఒకే వేదికపై ఉంటె తెలుగు ప్రేక్షకులకు చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా..కానీ ఇది జరగబోతుంది. ఈ నెల 28న ప్రతి ఒక్కరు అసలైన ఉగాది ఆనందాన్ని రుచి చూడబోతున్నారని అంటున్నారు హీరో రానా. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్ నేషనల్ ఫిల్మ్ అకాడమీ సంస్థ నిర్వహిస్తున్న అవార్డుల ప్రధానోత్సవాల్లో దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరూ ఒకే వేదికపై సందడి చేయనున్నారట.

చిరంజీవి ,బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ నటులతో పాటు యువ హీరోలందరూ ఈ అవార్డు ప్రధానోత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇక 2016 కి సంబంధించిన సినిమాలు వివిధ కేటగిరిలో అవార్డులు ఇవ్వనున్నారు.  ఇందులో తమిళ, మళియాళ,కన్నడ సినిమా దిగ్గజాలతో పాటు తెలుగు ఇండస్ట్రీ హీరోలందరూ కనువిందు చేయబోతున్నారట.

ఈ సందర్బంగా రానా ,జీవా,మరియు కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్ లో మీడియాతో ఐఫా ఉత్సవానికి నిర్వహించే ప్రక్రియను అలాగే నామినేషన్ల వివరాలను తెలియజేశారు. మొత్తం 13 విభాగాల్లో నాలుగు బాషల చిత్రాలకు అవార్డులను అందజేయనున్నారని తెలియజేస్తూ రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు ఐఫా ఆండ్రీ టిమిన్స్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: