మహేష్ బాబు టంగ్ స్లిప్ అయ్యారు
అంతే కాకుండా మహేష్ బాబు మూవీ టైటిల్ అది, ఇది అంటూ మీడియాలో వార్తలు రావటంతో…ఈ మూవీ అసలు టైటిల్ ఏంటి అనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు. సినిమా రిలీజ్ అనేది మరికొద్ది నెలల్లోనే ఉండగా…ఇంకా మహేష్ బాబు మూవీకి సంబంధించని న్యూస్ ఏదీ బయటకు రాకపోవటం అనేది అభిమానులను కలవరపెడుతున్న విషయంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో ఓ ప్రవేట్ ఈవెంట్ కి వచ్చిన మహేష్ బాబు…తన మూవీ ఫస్ట్ లుక్ 24న ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు 24న ఎటువంటి ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ టీజర్ గాని లేవని తెలుస్తుంది.
మహేష్ బాబు పొరపాటున ఓ డేట్ కి కమిట్ అయి... టంగ్ స్లిప్ కావటంతో….ఇప్పుడు ఫ్యాన్స్ నుండి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది గమనించిన మురుగదాస్….ఉగాది రోజున కచ్ఛితంగా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే అదే రోజు టైటిల్ కూడ రివీల్ కానుంది. ఇక ఆడియో వేడుకను మే 28వ తేదీన హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహిస్తారని అంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ వార్తలపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా…తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్. జె సూర్య విలన్ గా నటించడం విశేషంగా మారింది.