ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..ఎందుకూ..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. కానీ అందులో నటించే వారికి మాత్రం కష్టాలూ, కన్నీళ్లు కూడా ఉంటాయిని తెలుసు.  ఒక హీరో పది మంది హీరోలతో పోటీ పడి నటించి మెప్పించడం మంచి స్థాయిలోకి రావాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ అయితే గ్లామర్ గా నటిస్తూ..ఎదుటి వారికి ఎప్పటికప్పుడు రంజింపచేసే విధంగా కష్టపడాల్సి వస్తుంది..ఆ సమయంలో కొన్ని సార్లు మనసు చంపుకొని మరీ నటించాల్సి వస్తుంది. ఈ అభిప్రాయం ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగానే చెప్పారు.  

అయితే ఈ మద్య కొంత మంది హీరోయిన్లు తాము ఇండస్ట్రీలో స్థిరపడాలంటే హీరో, దర్శక, నిర్మాతలు తమను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాజాగా ఓ హీరో తనపై పడ్డ అపవాదకు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడట. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..మళియాంలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న దిలీప్.  ఆ మద్య మళియాళ నటి భావనను సొంత డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో భావన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకు న్యాయం జరిగే వరకు పోరాడింది..ఆ సమయంలో పలువురిపై అనుమానాలు కూడా కలిగాయి.  

మొత్తానికి నేరస్తుల దొరికారు..కటకటాల పాలయ్యారు.  ఈ మద్య దిలీప్ మీడియా తో మాట్లాడుతూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు..తాను ఆత్మహత్య చేసుకోవలని డిసైడ్ అయ్యానని దానికి కారణం..   హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారంలో దిలీప్ ప్రమేయం ఉన్నట్లుగా రకరకాల కథనాలు ప్రసారం కావడం సంచలనం సృష్టించింది . దాంతో అందరి కళ్ళు దిలీప్ వైపు అనుమానంగా చూస్తుండటం తో ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట .

తనకు ఓ కూతురు ఉంది కాబట్టి ఆమె కోసం ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానని అంటున్నాడు. దిలీప్- మంజు వారియర్ లు పెళ్లి చేసుకోగా ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. అయితే   మంజు వారియర్ కు అత్యంత ఆప్తురాలు భావన అలా భావన పై దిలీప్ కోపం పెంచుకున్నాడని అందుకే ఇలా జరిగిందని రకరకాల కథనాల నేపథ్యంలో దిలీప్ వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: