చిరంజీవికి ఆ కోరిక తీరలేదట..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయకృషింతో కష్టపడి పైకి వచ్చిన నటులు మెగాస్టార్ చిరంజీవి.  తెలుగు ఇండస్ట్రీలో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు ఇలా టాప్ హీరోలు ఉన్న సమయంలో డ్యాన్స్, ఫైట్స్ లో నూతన వొరవడి తీసుకు వచ్చి అభిమానుల మనసు గెలుచుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఒకదశలో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత అంత గొప్ప ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించింది చిరంజీవి ఒక్కరే.  

ఇక తెరపై ఎన్నో రకాల పాత్రలు పోషించారు చిరంజీవి.  కాకపోతే పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎక్కువగా నటించలేదు.  అయితే చిరంజీవి ఎన్ని పాత్రలు వేసినా ఒక్క పాత్ర చేయలేదన్న బాధ ఇప్పటికీ ఆయన్ని బాధపెడుతూనే ఉందట.  ఖైదీ నంబర్ 150 చిత్రంతో తొమ్మిదేళ్ల విరామం అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం ఓ పాపులర్ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో  ఓ కోరిక మిగిలిపోయిందని ఇటీవల ఆయన టీవీ షోలో మాట్లాడారు.స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పాత్రను వెండితెరపై పోషించాలని కలలుకన్నాను.

కానీ అనివార్య కారణాల వల్ల ఆ కోరిక తీరలేదు అన్నారు.  దేశం కోసం ప్రాణాలను అర్పించిన అలాంటి గొప్ప వీరుడి పాత్రలో నేను నటించలేకపోయాననే బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది. భగత్‌సింగ్ పాత్రలో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల అది చేజారిపోయింది. ఆయన జీవితంపై భిన్న భాషల్లో పలు సినిమాలు రూపొందాయి.

ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. దీనిని గురించి ఆయన మాట్లాడుతూ దక్షిణభారతవని నుంచి బ్రిటీష్‌వారి దమనకాండకు ఎదురొడ్డి పోరాడిన యోధుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించబోతుండటం గర్వంగా ఉంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: