బాలయ్య వర్సెస్ పవన్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలుగా వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు.  సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  ఈ సంవత్సరం బాలయ్య 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణీ తో మరో బ్లాక్ బస్టర్ నమోదు చేసుకున్నారు.  ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా తనదైన మానరీజంతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  

ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.  ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ స్టార్ హీరోల మద్య వార్ మొదలైందని అంటున్నారు.  అయితే ఇద్దరూ రాజకీయ రంగంలో ఉన్నారు కనుక రాజకీయ యుద్దమా అంటే అబ్బే..కాదు త్వరలో ఈ ఇద్దరు సినిమాలు  అభిమానుల ముందుకు రాబోతున్నాయి.  ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు .

ఆ చిత్రం కోసం భారీ ఎండలను సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు బాలయ్య . ఆ సినిమాని శరవేగంగా పూర్తిచేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు.ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కూడా ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి సినిమా చేస్తున్నాడు పవన్ . ఇక ఈ సినిమాని కూడా త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు .  సో..ఆ మద్య అన్నయ్యతో పోటీ పడ్డ బాలయ్య ఇప్పుడు తమ్ముడితో కూడా పోటీ పడుతున్నారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: