ప్రభాస్ బద్ధకస్తుడు: రాజమౌళి



బాహుబలి బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా  దృశ్య మాధ్యమాలకు అంటే టెలివిజన్లకు ఇంటర్వ్యూలు ఇవ్వటం సర్వ సాధా రణ మైంది. ఇలాంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్దొనే రాజమౌళి బృందం,  అనేక సంధర్భాలలో తమ బృంద సభ్యుల గురించి వారి అలవాట్ల గురించి అప్పుడప్పుడు మాట్లాడటం పరిపాటయింది. అలాంటి ఒక సంధర్భంలో రాజమౌళి ప్రభాస్ సోమరితనం గురించి ఒక సరదా సంఘటన చెప్పారు.




"ప్రభాస్ ఓ పెద్ద అపరిచితుడు అని తన లో రెండు రకాల వ్యక్తులు ఉన్నారని చెప్పారు. తను సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడని, షూటింగ్ లేనప్పుడు మాత్రం చాలా బద్దకంగా ఉంటాడని రాజమౌళి  అన్నారు" అంటే ఇష్టమైన పని ఎంత కష్ఠమైనా  చేస్తారని, అదే సందుదొరికితే ఎంత సోమరితనమైనా ప్రదర్శిస్తారని, దీనికి ఉదాహరణగా ఇటీవలే ముంబాయి  ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఒక సంఘటన చెప్పారు.


"బాహుబలి ది కంక్లూజన్"  ట్రైలర్ రిలీజ్ కోసం ముంబై వెళ్ళిన రాజమౌళి బృందం, అది పూర్తి కాగానే తిరిగి హైదరాబాద్ రావడానికి ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటు న్నారట. ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళాక చూస్తే ప్రభాస్ వీళ్ళతో లేడట, "ఎక్కడున్నావు?"  అని రాజమౌళి ఫోన్ చేస్తే "లాంజ్ లో రెస్ట్ తీసుకుంటున్నా"  అని ప్రభాస్ చెప్పాడట.



"ముంబై విమానాశ్రయానికి ఎన్నిసార్లు వెళ్ళిన అక్కడ ఒక లాంజ్ ఉందని, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చని తమకి తెలియదని, ప్రభాస్ మాత్రం, ఇలాంటివి వెతికి భలేగా పట్టేస్తాడని"  చెప్పిన రాజమౌళి; తను,  శోభు కలిసి ప్రభాస్ ఉన్న లాంజ్ కి వెళ్లారట. "ఫ్లైట్ కి ఇంకా అరగంటే టైం ఉంది, నువ్వేంటి తాపీగా ఇక్కడ కూర్చున్నావు"  అని నిర్మాత  శోభు యార్లగడ్డ అడిగితే,  “కష్టపడాలి అంటే రాజమౌళి తో వెళ్ళండి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే నాతో ఉండండి”  అని చెప్పిన ప్రభాస్ “మీరేం టెన్షన్ పడకుండా ఇక్కడ కూర్చోండి, ఫ్లైట్ సంగతి నాకు వదిలేయండి” అన్నాడట.


రాజమౌళి, నిర్మాత శోభు టెన్షన్ పడుతూనే ప్రభాస్ దగ్గర కూర్చున్నారట. కాసేపటికి ఒక  లేడీ ఆఫీసర్ వచ్చి, "సర్ సెక్యూరిటీ చెక్ అప్ దగ్గర క్యూ తగ్గిపోయింది, మీరు రండి"  అని పిలిచారట. "క్యూ లో ఎంతమంది ఉన్నారు"  అని ప్రభాస్ ఆమెని అడిగాడట. "15 మంది ఉన్నారు"  అని ఆమె చెబితే, "15 మంది ఉన్నారు కదా, ఇంకో పదిమంది తగ్గాక చెబుతారా? అప్పుడు వస్తాం"  అని ప్రభాస్ బదులిచ్చాడట.


"అంటే, 15 మంది ఉన్న క్యూలో నిలబడాలన్నా ప్రభాస్ కి బద్దకమే అని, అదే సినిమా కోసం అయితే ఎంతైనా కష్టపడతాడని అంటే ఇష్టమైన పని ఎంత కష్ఠమైన చేస్తారని, అదే సందుదొరికితే ఎంత సోమరితనమైనా ప్రదర్శిస్తారని"  దీనికి ఉదాహరణగా ముంబాయి ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఈ  సంఘటన చెప్పారు రాజమౌళి. 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: