రాజమౌళి వర్సెస్ వర్మ..ఎంటాకథ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలోకి శివ చిత్రంతో అద్భుతమైన విజయం సాధించారు రాంగోపాల్ వర్మ.  తర్వాత కామెడీ, హర్రర్, మాఫియా తరహా చిత్రాలు తీసి మంచి సక్సెస్ సాధించిన వర్మ బాలీవుడ్ ఎంటీ ఇచ్చి అక్కడ కొన్ని హిట్ సినిమాలు తీశారు.  అయితే అక్కడ వరుస ఫ్లాపులు ఎదుర్కోవడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు.  వర్మ ఏ సినిమా అయినా సరె తనదైన స్టైల్లో చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేస్తారు.  ఇక ఇండస్ట్రీలో వర్మకు మంచి మిత్రులుగా ఉన్నవారిలో రాజమౌళి, పూరి జగన్నాథ్ చెప్పుకోవచ్చు.  

తాజాగా వర్మకు, రాజమౌళికి మద్య కొనసాగిన ట్విట్స్ మరోసారి సంచలనాలు సృష్టించాయి.   గతంలో  రాంగోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేసి. దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అని కేప్షన్ పెట్టారు. ఇక అప్పటినుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనపడుతున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ.

అంతా బాగుంది కానీ ఈ ట్విట్ల మద్య మరో వ్యక్తి ఎంటర్ అయ్యారు.  ఆయనే ఒకప్పుడు పవన్ కళ్యాన్ పై ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన  బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ . మీరిద్దరూ గొప్ప దర్శకులన్నది వాస్తవమని, అయితే ఇద్దరూ అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు. వెంటనే వర్మ ట్విట్ చేస్తూ.. మీరు చాలా బాగా చెప్పారని, అందరూ మీ అంత, షారుక్ ఖాన్ అంత అందంగా ఉండలేరని వెటకారంగా సమాధానం ఇచ్చారు.

దానికి మళ్లీ కమాల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసని, అయితే షారుక్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు. దానికి ఈ ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ.. బ్యూటీ అంటూ ఆ రెండు పదాల కలయికతో ఓ పెద్ద వాక్యాన్ని ట్వీట్ చేశారు.

వర్మ ట్విట్స్ :

Beauty and the Ugly pic.twitter.com/hKXGGcpfE4

— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017 The ugly is the beastly me and @ssrajamouli is looking more sexier than the beautiful #baahubali2 pic.twitter.com/5KUYgepcMu

— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017 Well sir everybody can't be as handsome as u and Sharuk khan https://t.co/AvRnt8BhCU

— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017 Yes sir this whole world will agree👍 https://t.co/m7dBBXlslm

— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017 Ugly is beauty to ugly bcos beauty is not ugly to ugly like ugly is ugly to beauty n hence proved beauty ugly is not a ugly beauty

— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: