అక్షయ్ కి కోపం వచ్చిందా..అవార్డు వెనక్కి తీసుకోండి..!

Edari Rama Krishna
ఈ మద్య జాతీయ ఉత్తమ చిత్రాలకు, నటులకు, వివిధ రంగంలో ప్రతిభ చూపిన వారికి జాతీయ ఉత్తమ అవార్డులు ప్రకటించారు.  కాగా ఈ కేటగిరిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఆ అవార్డుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.  తనకు ఈ అవార్డు రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు.  దంగల్ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అమీర్ ఖాన్, అలీగఢ్ చిత్రంలో మనోజ్ బాజ్ పాయ్ కన్నా రుస్తుంలో నటించిన అక్షయ్ నటన ఏమంత గొప్పగా లేదని కొంతమంది విమర్శిస్తున్నారు.  

మరో ట్విస్ట్ ఏంటంటే అక్షయ్‌కి సన్నిహితుడు, హేరాఫేరి, భాగం భాగ్ వంటి అక్షయ్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా ఉండడం వల్లే అతనికి ఈ అవార్డు వచ్చిందని మరికొందరు పెదవి విరిచారు. దీనిపై స్పందించిన అక్షయ్ తాను గత పాతికేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నానని ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించానని అప్పటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వింటూనే ఉన్నానని అన్నారు.

అయితే తనకు అవార్డు ప్రకటించిన ప్రతిసారి కొంత మంది పనికట్టుకొని తనపై కామెంట్లు చేస్తున్నారని వాపోయారు.  తనకు 26 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారం లభించిందని, ఇది కూడా మీకు నచ్చకపోతే ఈ అవార్డు వెనక్కి తీసుకోండని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: