హైదరాబాద్ లో బాహుబలి బెనిఫిట్ షోలకు అనుమతిలేదు: తలసాని





తెలంగాణాలో బెనిఫిట్ షోల సంస్కృతిలేదని, అలాంటి ప్రదర్శనలకు ఎవరైనా పాటుపడిఒతే వారికి ఇక పాట్లేనని  'బాహుబలి-2' బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోలు వేయకూడదని ఔమతిలేదని, సర్కార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని బేఖాతరు చేయడం పై సినిమాటోగ్రపీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.


"మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి!" అంటూ హైదరాబాద్ లోని కొన్ని చోట్ల థియేటర్స్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ షరతులను పట్టించు కోకుండా బెనిఫిట్ షోలకు టికెట్స్ అమ్మారట. చాలా చోట్ల ఇప్పటికే టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. గురువారం రాత్రి పదిన్నరకు అనేక నగర థియేటర్స్ లో బెనిఫిట్ షో లు వేసేందుకు రంగం సిద్ధం చేసారట.






ప్రీమియర్ షో ? నిజమా, పుకారా? నిజమైతే కాఋఅణమైన వారిపై చర్యలు తప్పదని బాహుబలి-2 మేనియాను క్యాష్ చేసు కోవడానికి థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్ని స్తున్నాయని తమకు తెలిసి నట్లు తలసాని చెప్పారు. బాహుబలి-2  ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి నిస్తూ కొన్ని కఠిన నిబంధనలను విధించింది. వాటికి విరుద్ధంగా వ్యవమరించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బెనిఫిట్ షోలకు అసలు తెలంగాణాలో అనుమతి ఇవ్వలేదని, ఏప్రిల్ 28 నుండి ఐదు షోలకు అదీ ఒక వారం రోజుల పాటు మాత్రమే ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చామని, దీనికి విరుద్ధంగా ఇష్టానుసారం గా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 





"బెనిఫిట్ షోల పేరుతో ఎవరు ఎవరికి బెనిఫిట్ చేస్తున్నారో?" అర్థం కావడం లేదని, ఆ విషయంలో చాలాసీరియస్ గా ఉంటాం ఆ తర్వాత జరిగే పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలకు థియేటర్ యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంద న్నారు మంత్రి తలసాని అన్నారు. ఐదు షోలు అనుమతినిచ్చి తెలంగాణ ప్రభుత్వం బాహుబలి-2 ది కంక్లుజన్, లాంటి గొప్ప సినిమాను ప్రమోట్ చేస్తుందని, ప్రభుత్వం ఏ రేట్లు అయితే ఫిక్స్ చేసిందో అదే రేట్లకు టికెట్స్ అమ్మాలని, డిమాండ్ ఎక్కువ గా ఉందని ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు బెనిఫిట్ షోల టికెట్స్ కొనుగోలు చేసిన వారు అయోమయంలో పడ్డారు. షో మొదలయ్యే వరకు అసలు సినిమా ప్రదర్శన ఉంటుందో? లేదో? తెలియని పరిస్థితి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: