వాట్స్ అప్ లో బాహుబలి2 సినిమా వచ్చేసిందా?
అయితే ఈ క్లిప్ ని చూసిన సామాన్య ప్రేక్షకులు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. బాహుబలి2 సినిమా కేక అని రిలీజ్ కి ముందే ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. ఇంతకీ ఏంటా క్లిప్. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం…బాహుబలి2 కి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ వాట్స్ అప్ లో సర్క్యులేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమిళనాడు అంతటా ఈ క్లిప్ ప్రచారంలోకి వెళ్ళిందని అంటున్నారు.
తమిళ వెర్షన్ కి సంబంధించిన బాహుబలి2మూవీలోని కొన్ని సెకండ్ల క్లిప్స్ బయటకు రావటంతో…ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచిందని అంటన్నారు. అయితే ఈ క్లిప్ ఎలా బయటకు వచ్చింది? అనే విషయం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఒక్క చిన్న క్లిప్ మాత్రమే బయటకు వచ్చిందా? లేదా మొత్తంగా వీడియో ఉందా? అనేది కొందరిలో కలుగుతున్న ప్రశ్న. ఇక తమిళనాడు నుండి బాహుబలి2 మూవీపై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
బయటకు వచ్చిన ఆ చిన్న క్లిప్ తమిళ సినీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందట. అందుకే బాహుబలి2 మూవీపై అక్కడ హైప్ క్రియోట్ అవుతుంది. ఇక తమిళంలో బయటకు వచ్చిన ఆ క్లిప్జజజఇప్పుడు దేశంలోని అన్ని చోట్లకి వాట్స్ అప్ ద్వార ట్రావెల్ అవుతుందని అంటున్నారు. మొత్తంగా ఇది బాహుబలి2 మూవీకి పాజిటివ్ ప్రమోషన్స్ చేస్తుందని అంటున్నారు.