రిలీజ్ కు ముందే 19 కోట్ల రూపాయలను అమెరికాలో కొల్లగొట్టిన "బాహుబలి 2, ది కంక్లుజన్"





"విడుదలవ్వకు ముందే $ 3 మిలియన్ డాలర్ల (19 కోట్ల రూపాయిలు) క్లబ్ లోకి చేరిపోయింది బాహుబలి 2 ది కంక్లుజన్. తొలి రోజే ఈ మార్క్ సాధించిన తొలి భారతీయ చిత్రం అన్నీ భాషలు కలిపి "బాహుబలి 2" అని ది గ్రేట్ ఇండియా ఫిలింస్, బాహు బలి యూఎస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వసూళ్ళ సరిహద్ధులను కక్ష్యలను దాటేసిందని ఉత్సాహంగా తెలపటం ఈ సినిమా సత్తా ఏమిటో తెలుపుతుంది.







అందరూ అన్నె చోట్ల కొత్త కొత్త గొప్ప గొప్ప రికార్డులను సృష్టిస్తుందని చెప్పినా, ఉత్తర అమెరికాలో ఈ విజయం బాక్స్ ఆఫీస్ అద్భుతమే నని అంటున్నారు. ఈ వసూళ్ళను అధికారికంగా నిర్ధారిస్తూ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం నుండి గంటకొక లక్ష డాలర్ల వసూళ్ళు సాధించినట్లు తెలిపారు. 


ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్స్ లో విడుదలవగా ఒక్క భారత్ లోనె 6500 స్క్రీన్ పై ఈ సినిమా తన విజయ విహారాన్ని హిందీ మరియు తెలుగు, తమిళ, మళయాల దక్షిణ భారత బాషల్లోను విడుదలై కొనసాగిస్తుందని ది గ్రేట్ ఇండియా ఫిలింస్ తెలిపింది. 


సినీ అండితుల ఆశాభావం ప్రకారం విస్పోఠనాన్ని గుర్తుచేసే వసూళ్ళను ఈ సినిమా తొలి రోజే సాధించగలదని భావిస్తున్నారు. వారి అంచనాల ప్రకారం ఈ సినిమా రూ.1000 కోట్ల మార్కును అవలీలగా దాటేసి "వెయ్యికోట్ల క్లబ్" ను భారత్ లో ప్రారంభిస్తుందన్నారు.




అమెరికాలో ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదలౌతున్న తొలి ఇండియన్ సినిమా ఇది అని చెపుతున్నారు. 40 కి పైగా ఐమాక్స్ థియేటర్స్ లోనూ చాలా పెద్ద లార్జ్ స్క్రీన్స్ లోను ఈ సినిమా విడుదలౌతుందని చెపుతున్నారు. 


భారత్ లోకూడా ఊహాతీత వసూళ్ళతో ఈ సినిమా హోరెత్తించగలదని మంచి స్థితిలో హైప్ క్రియేట్ అయిందని క్రేజ్ తారస్థాయికి చేరిందని కెరళ లాంటి చిన్న రాష్ట్రం లోనె రూ.5  కోట్ల "కిల్లింగ్ గ్రాస్" వసూళ్ళ తో విజయాన్ని తొలి రోజే సాధిస్తుందని ట్రేడ్ మాస్టర్స్ చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కర్ణాటక లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఊహాగానం.   




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: