బాహుబలి ది కంక్లూజన్ కీర్తి కిరీటానికి మరో ఫెదర్ చేరింది


తెలుగు సినిమా బాహుబలి టూ ది కంక్లూజన్ కీర్తి కిరీటం లో దాని విశ్వవిహారంలో మరోదేశం అదీ మన శత్రుదేశం ఒక కలికి తురాయిగా చేరింది. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ కొలీవుశ్, సాండలువుడ్ ఇలా అన్నీ వుడ్లతో పాటు హాలీవుడ్ ను కూడా దున్నేసింది. 


    
ఇండియా అంతటానే కాదు నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ ఇలా చెప్పుకుంటూ పోవటం ఒక చాంతాడంత అవితుంది, సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతున్న బాహుబలి - ది కంక్లూజన్ పాకిస్తాన్ లోనూ తన జైత్ర యాత్ర లో ఇంతే స్థాయి ఆదరణను పొందుతుండటం గమనార్హం. భారతీయ సినిమాల విడుదలపై ఇటీవలే పాక్ లో నిషేధం తొలగింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2 ది కంక్లూజన్ అక్కడా విడుదల అయ్యింది. దాదాపు వంద స్క్రీన్లపై ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబు తున్నారు.


హిందూ సంప్రదాయం నేపథ్యంలో సాగే సినిమా అయినప్పటికీ పాక్ లో కూడా మంచి ఆదరణ లభించిందని డిస్ట్రిబ్యూటర్లు వివరించారు. సాధారణంగా భారతీయ సినిమాలకు పాక్ లో సెన్సార్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. బాహుబలి 2 ది కంక్లూజన్ మాత్రం మినహాయింపు, అంటే ఒక్క కట్ కూడా అవసరం లేకుండా ఈ సినిమాకు పాక్ సెన్సార్ ‘యూ’  సర్టిఫికెట్ లభించినట్టుగా డిస్ట్రిబ్యూటర్లు వివరించారు.


కలక్షన్ల విషయానికి వస్తే, ఈ సినిమా కు వచ్చిన పాజిటివ్ టాక్ ను బట్టి, కనీసం ఆరు కోట్ల రూపాయల వరకూ సాధించే అవకాశం ఉందనే అంచనాలను వ్యక్తం చేస్తున్నారు పంపిణీ దారులు. ఆ స్థాయి వసూళ్లు దక్కితే ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టే. అయితే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: