రాజమౌళి దేవుణ్ణి నమ్మరా?



"బాహుబలి ది బిగినింగ్"  సినిమాలో హీరో ప్రభాస్ శివలింగాన్ని భుజస్కందాలపై ఎత్తుకుని మోసే దృశ్యం చూశాక ప్రభాస్‌ కు ఎంత భక్తి ఉందో?  అని అనుకోవడం సహజం. ఇదే కాదు రాజమౌళి ప్రతి సినిమాలో ఎదో ఒక దేవుడి సన్నివేశం ఉంటుంది. కానీ నిజానికి రాజమౌళి దేవుణ్ణే నమ్మరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వూలో చెప్పాడు. కాని "బాహుబలి-ది బిగినింగ్" సినిమా లో శివలింగం ఎత్తే సన్నివేశాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడూ,  ఆ దృశ్యంలో దర్శకునిగా  రాజమౌళి పలి కించిన  భావోద్వేగాన్ని చూసి కొందరు చలించి పోయారు. కొందరు పులకించిపోయారు. 


 
ఇలాంటి మనసును హత్తుకునే దృశ్యాలను తీసిన రాజమౌళి ఆస్తికుడా? నాస్తికుడా? అనే చర్చ జరగటం సహజం. అయితే ప్రపంచంలోని చాలా మంది తాము నాస్తికుల మా? ఆస్తికులమా? అని కూడా నిర్ధారించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక సామాజిక సర్వే ప్రకారం తాము ఖచ్చితంగా నాస్తికులమే అని ప్రకటించుకున్న వాళ్లు ప్రపంచంలో 80 కోట్ల మంది ఉన్నారు. అలాగే తమకు మతంతో నిమిత్తం లేదని చెప్పుకున్న వాళ్లు 130 కోట్ల మంది ఉన్నారు. 



ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతోందనే వాదన బలంగా ఊపందుకుంటోంది. ఉపనిషత్తు లు, వేదాలకు నిలయంగా ఉన్న భారతదేశంలో దేవుడిపై విశ్వాసం సన్నగిల్లుతుండటంపై ఆస్తికులను ఆందోళనకు గురి చేస్తోంది. తాము నాస్తికులమని చెప్పుకునే ప్రముఖుల భావాలు సమాజంపై తీవ్రప్రభావం చూపుతున్నాయని వారు అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు.



ఒక అంతర్జాతీయ సర్వే చెపుతున్న గణాంకాల ప్రకారం 700 కోట్ల ప్రపంచ జనాభాలో దేవునిపై నమ్మకం లేని "నాస్తికులు" 14% అంటే 980 మిలియన్ గా ఉన్నారు. అంటే 98 కోట్లమంది అన్నమాట. 


 
బాహుబలిలో కథానాయకుడు శివుని భుజాలపై ఎత్తుకొని నడిచే దృశ్యం అద్భుతంగా చిత్రీకరించిన రాజమౌళి తాను నాస్తికుడినని ప్రకటించడంపై వారు అభ్యతరం వ్యక్తం చేస్తు న్నారు. నైతిక విలువలకే ప్రధాన్యం ఇస్తామని చెప్పుకునే భౌతిక వాదులు, నాస్తికులు కూడా రాజమౌళి తీరును తప్పుబడుతున్నారు. నాస్తికుడైన రాజమౌళి దేవుడు ఉన్నాడనేలా "బాహుబలి" లో శివలింగం దృస్యం చూపించడం సరికాదని అంటున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆక్షేపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: