బాహుబలి పై ఏ ఆర్ రహమాన్ స్పందన అద్భుతం



బాహుబలి విజయం ఒక అద్భుతం. అన్నీ సమపాళ్ళలో కుదిరితే తయారయ్యే వంట ఎంత అద్భుతమో బాహుబలి అంతే. అయితే వంట ఎంత రుచికరమైనా అది వడ్డించే సమయం ప్రధానం, విందారగించే వారి ఆకలి ప్రదానం. ఆవురావురనేలా వినోదం వండి వార్చి సరైన సమయంలో "బాహుబలి వడ్దన" జరిగింది. అదీ అసలు విజయానికి సోఫానం. 


"కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" ఈ ప్రశ్న రెండేళ్ళు ప్రేక్షకజనంలోని రగులుతున్న ఆశక్తికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఆ ఆశక్తి రగులుతూనే వచ్చి ఏప్రిల్ 28 నుండి క్రమంగా ఫేడౌట్ అయ్యేసమయానికే 1000 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించింది. వెనువెంటనే దృశ్యాల విందులో ప్రేక్షకులు కొత్త రుచులు కనుగొనటంతో మరో పరుగు ప్రారంభించి 2000 కోట్లకు పరుగులు తీస్తుంది. అదే పాయింట్ ను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్. రహమాన్ కొనియాడారు.


వసూళ్ళ ప్రాతిపథికన చూస్తే ఇండియా లో ఇప్పటి దాకా ‘బాహుబలి’ని మించిన చిత్రం రాలేదన్నది వాస్తవం. ఐతే ఒక్క భారీతనం, భారీ కలెక్షన్లను బట్టి ఈ సినిమానే మహోన్నతం అని తేల్చేయడం ఎప్పుడూ మంచిదికాదు. ఏఆర్ రెహమాన్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. "బాహుబలి" బృందం బాగా ఇష్టంతో కష్టపడిపనిచేసింది. ఇష్టంతో చేసిన పని మంచి ఫలితాన్నందుకుంది. అయితే ఇంతకు ముందు కూడా "ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ" లో ఇలాంటి భారీ ప్రయత్నా లు చాలా సార్లు చోటు చేసుకున్నాయని చెప్పారు రెహమాన్. ఇందుకు కొన్నింటిని రహమాన్ ఉదాహరించారు. 


హృతిక్ రోషన్ హీరోగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో  ప్లాన్ చేసిన సినిమా "పానీ" కూడా ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో తీయడానికి శేఖర్ కపూర్ ప్రణాళికలు రచించారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని అన్నాడు. 


అలాగే రజినీకాంత్ కూతురు సౌందర్య రజినకాంత్ హీరోగా తీసిన "కోచ్చడయాన్" కూడా గొప్ప ప్రయత్నమే అన్నాడు రెహమాన్. ఐతే ఆ సినిమాకు "కంప్యూటర్ గ్రాఫిక్స్" సరిగా కుదరక ప్రతికూల ఫలితం వచ్చిందన్నాడు. 


బాహుబలి విషయానికి వస్తే, బృంద నాయకుడు అసలే జక్కన్న, ఓపిక, శ్రద్ద, ఇష్టం, పరిశీలన ఎక్కున. అంతేకాదు నటీ నటుల్ని సాంకేతిక నిపుణులని ఆఖరికి ప్రేక్షకుల్ని సిద్ధం చేశారు. దీనికి మంచి టీం కుదరిందని, అందరూ కష్టపడటానికి తోడు, అందరూ ఒక మహాయజ్ఞానికి స్పందించినట్లు భక్తి భావంతో స్పందించటం రాజమౌలి సిద్దం చేసిన తీరు మరువరానిది. ఈ సినిమాకు అన్నీ కలిసి రావడంతో మంచి ఫలితం వచ్చిందని అన్నాడు రెహమాన్. 


సుందర్ రూపొందించబోయే ‘సంఘమిత్ర’ కూడా గొప్ప స్థాయిలో ఉంటుందని రెహమాన్ అన్నాడు. ఆ చిత్రానికి రెహమానే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: