ఆ మూవీ నుండి నిత్యామీనన్ ను తప్పించారు

E. Rama Krishna
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ దూకుడిని చూపిస్తున్నారు. మంచి ఫిజిక్ తో...అందమైన అభినయంతో వీరు ఆఫర్స్ ని చేజిక్కించుకుంటున్నారు. ఆ విధంగానే ‘ ప్రేమమ్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవికి ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు.

దీంతో దక్షిణాది సినీ పరిశ్రమ నుండి సాయి పల్లవి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఓ క్రేజీ హీరోయిన్ ఆఫర్ ని దక్కించుకుంది. నిత్యామీనన్, సందీప్ కిషన్ కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది. తాజాగా నిత్యామీనన్ ను ఆ మూవీ నుండి తప్పించి...ఇందులో సాయి పల్లవి ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

సాయి పల్లవి సైతం మంచి కథలతో పాటు ఇండస్ట్రీలో కాస్త పేరున్న హీరోల మూవీలతోనే నటించేందుకు ఆసక్తి చూపుతుంది. నిత్యామీనన్ సైతం తన ఆఫర్ ని సాయి పల్లవి చేజిక్కించుకోవటంతో ఈ బ్యూటీపై కాస్త కోపంగానే ఉందని అంటున్నారు. ఇక సాయిపల్లవి తాజాగా చేజిక్కించుకున్న ఆఫర్స్ వివరాలను చూస్తే... మెగా హీరో వరుణ్ తేజ్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాలో నటిస్తుంది.

అలాగే నేచ్యురల్ స్టార్ నాని చేయనున్న కొత్త సినిమాకి సైన్ చేసింది. అలాగే మరో యంగ్ హీరో సరసన కూడా హీరోయిన్ గా కుదిరినట్టు తెలుస్తోంది. నాగ శౌర్యతో సాయి పల్లవి నటించే సినిమా జూన్ లేదా జూలైలో మొదలుకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: