దుమ్ముదులిపేస్తున్న డిజె సాంగ్..!

shami
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. మెగా హీరోల్లో వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అల్లు అర్జున్ లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాధం మూవీ చేస్తున్నాడు. 


ఇక రీసెంట్ గా ఈ సినిమాలోని మొదటి సాంగ్ శరణం భజే సాంగ్ ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ బన్ని ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ అయిన కొద్దిగంటల్లోనే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూయర్స్ సాధిస్తుంది డిజె సాంగ్.


ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటేసిన ఈ సాంగ్ చూస్తుంటే ఇంకా భారీగా వ్యూయర్షిప్ సాధించేలా ఉంది. యూట్యూబ్ లో బన్ని రికార్డులను క్రాస్ చేయడం ఎవరి వల్లా కాదేమో. డిజె టీజర్ కూడా దాదాపు రికార్డ్ వ్యూయర్షిప్ తో సరికొత్త సంచలనాలు సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా క్రేజీ ఆల్బంగా రాబోతుంది.  


పూజా హగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూన్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు బన్ని. యూట్యూబ్ లో డిజే ఫీవర్ చూస్తుంటే కచ్చితంగా బన్ని మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: