హలో..మా సినిమా కాపీ కాదు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రెండవ చిత్రం ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘మగధీర’.  ఈ చిత్రం అప్పట్లో తెలుగు రాష్ట్రంలో రికార్డులు మోత మోగించింది. అంతే కాదు ఈ చిత్రంతో అటు జక్కన్నకు, రాంచరణ్ కి ఎక్కడలేని పేరు ప్రతిష్టలు వచ్చాయి. తాజాగా మగధీర చిత్రాన్ని బాలీవుడ్ వారు కాపీ చేశారని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కోర్టుకెక్కారు.   ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అచ్చం మగధీర కి కాపీ కొట్టినట్లు అనిపిస్తుందని కొన్నీ సీన్లు అచ్చం అలాగే దింపారని ఆయన ఆరోపిస్తున్నారు.

 కాగా బాలీవుడ్ మూవీ రబ్తా కాపీ చిత్రం కాదని యూనిట్ అంటోంది. అంతే కాదు మా చిత్రం ట్రైలర్ చూసి కాపీ అంటారా అని ప్రశ్నించింది. తాము తీసిన మగధీర సినిమాకు రబ్తా కాపీ అంటూ నిర్మాత అల్లు అరవింద్ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. అయితే మా మూవీకి సంబంధించిన 2 నిముషాల 14 సెకండ్ల ట్రైలర్ చూసి సినిమా కాపీ అంటూ ఎలా నిర్దారిస్తారని యూనిట్ నిలదీసింది.

అంతే కాదు మగధీర చిత్రంలోని సన్నివేశాలు పోలి ఉన్నాయని అంటున్నారు..ఇలాంటి సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో రక రకాల యాంగిల్స్ లో చూపించారు. అంతమాత్రాన వాటిని పోలి ఉన్నాయని ఆరోపిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  చాలా సినిమాల్లోని సన్నివేశాలను ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తిని పొంది తీస్తున్నారని, అంత మాత్రాన అది కాపీ అని ఆరోపణలు చేయడం సరి కాదని రబ్తా చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారొక పత్రికా ప్రకటన విడుదల చేశారు.



Official Statement on behalf of the producers of #Raabta, Dinesh Vijan and Bhushan Kumar pic.twitter.com/ueU87TUIuv

— taran adarsh (@taran_adarsh) May 25, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: