ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతి రావు..!?

Chakravarthi Kalyan
చలపతిరావు.. పాపం సినీ ఇండస్ట్రీలో ఉన్నాడో లేడో తెలియని.. ఈ వెటరన్ ఆర్టిస్టు ఒక్క మాటతో ఒకే ఒక్క మాటతో మళ్లీ సంచలన వ్యక్తిగా మారిపోయారు. వార్తల్లో వ్యక్తి అయ్యారు. అమ్మాయిలా.. పక్కలోకి పనికొస్తారు.. అన్న ఒక్క మాటతో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. విమర్శించవారు కొందరు.. సమర్థించవారు కొందరు.. తిట్టిపోసేవారు మరికొందరు. 



అలాంటి చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట. పక్కలోకి పనికొస్తారు.. అన్న డైలాగ్ పై వచ్చిన విమర్శలను చూసి కాదండోయ్.. ఇది చాలా పాత ముచ్చట అట. గతంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చలపతిరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఆత్మహత్యచేసుకోవాలనేంత పరిస్థితులు ఎందుకొచ్చాయి అంటారా..



పాపం.. చలపతిరావు పైకి కరుగ్గా విలన్ లాగా కనిపిస్తారు కానీ ఆయనది సున్నిత హృదయమే. ఆయన సినిమాల్లోకి రాకముందే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 26-27 వయస్సుకే ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యారు చలపతిరావు. ఆ సమయంలో ఆయన భార్య హఠాత్తుగా కన్నుమూసింది. ముగ్గురు చిన్న పిల్లలు ఓ వైపు.. ఆర్థిక ఇబ్బందులు మరో వైపు..



అందుకే చలపతిరావు గారు ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నారట. కానీ తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారన్న కారణంతో కంట్రోల్ చేసుకున్నారట. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా.. పిల్లల కోసం ఆయన పెళ్లికి దూరంగా ఉండిపోయారు. దటీజ్ చలపతిరావు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: