రజనికాంత్ తో త్రిష జోడీ కడుతుందా?



"తలచినదే జరిగినదా దైవం ఎందులకూ! జరిగినదే తలచితివా శాంతిలేదు నీకూ!" ఎవరికైనా అనుకున్నవి, కోరుకున్నవి, ఆశించినవి అన్నీ అనుకున్నట్లు జరగవు. కొన్ని సార్లు మనం ఊహించనివి జరుగుతాయి. అదే జీవితం. కథానాయకి త్రిష జీవితం వ్యక్తిగతంగా చూసుకున్నా, వృత్తిగతంగస్ చూసుకున్నా అనుకున్నవి, కోరుకున్నవి, ఆశించినవి అనుకున్నట్లు జరగలేదు. దాదాపు  ఇలాగే ఉంటుంది.ఈ చెన్నై భామ కథానాయకగా చిత్ర సీమను దున్నేసింది. 


అయితే ఈ స్థాయికి చేరడానికి త్రిష చాలా కష్ట పడి పోరాడి చేరుకుందన్నది మనం మరచిపోకూడదు. ఈ అందాల భామకు అదృష్ఠం కూడా ఉడుము లాగే వదల కుండా పట్టిందనే చెప్పాలి. త్రిష సినిమా రంగానికి మోడలింగ్‌ రంగం నుండే చాలా మంది తారల లాగే సిగుమతైంది. మోడలింగే తన తొలి వేదిక. 


ఆ తరువాత సినీ నటి అవ్వటానికి అనేక ప్రయత్నాలు చేసి "జోడీ" అనే చిత్రంలో కథానాయకి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా, సహాయనటిగానే తన సినీ జీవితాన్ని 1999లో ప్రారంభించింది.అలా నటిగా తన వయసిప్పుడు 18 ఏళ్లు. ప్రథాన కథానాయకిగా తన తొలి చిత్రం "మౌనం పేసియదే" 2002 లో నటించింది. అలా కథానాయకిగా ఆమె వయసు 15 ఏళ్లు. కథానాయకిగా తొలి అద్భుత వ్జయం "సామి" అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడని సక్సెస్‌ఫుల్‌ కథానాయకి. ఇప్పటికీ నాయకిగా కొనసాగుతోంది. 


ఆమె తొలి తెలుగు బ్లాక్ బస్టర్ "వర్షం" తో ఆమె ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డీ గా కీర్తి చంద్రికలు దేశమంతా వెల్లి విరిశాయి. ఈ నెల నాలుగున త్రిష 35వ వసంతం లోకి అడుగు పెట్టారు. త్రిష తన సినిమా జీవితం లో తమిళం, తెలుగు, కన్నడం, హిందీ లో కూడా ప్రముఖ కథానాయకులతో జత కట్టి నటించి ఘన విజయాలే స్వంతం చేసుకుంది. "హీరోయిన్  సెంట్రిక్" సినిమాల్లో కూడా నటించింది, ఇంకా నటిస్తూనే ఉంది.


ముఖ్యంగా తమిళ లోకనాయకుడు కమలహాసన్‌ నుంచి, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, శింబు, ధనుష్‌ వరకూ అందరు స్టార్స్ హీరోస్ తోనూ, యంగ్ మరియు అప్‌కమింగ్‌ హీరోలతో సహా అందిరితోనూ రొమాన్స్‌ చేసింది.  ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టాలన్నది త్రిష చిరకాల వాంచ. అవకాశం కోసం ఎదురు చూస్తోంది.ఈ విషయాన్ని తను బహిరంగంగానే పలు సభల్లో వెల్లడిం చింది. త్వరలోనే రజనీకాంత్‌తో నటిస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.


పా.రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం "కాలా" లో అవకాశం వస్తుందనే ఆశతో అలా అని ఉంటుంది. అయితే కాలా చిత్రంలోనూ రంజిత్‌ బాలీవుడ్‌ అందగత్తెలపైనే మనసుపడ్డరట. మరో రెండేళ్ల వరకూ రజనీకాంత్‌ కొత్త చిత్రం ఉండదు.ఆ తరువాత అయినా త్రిషకు రజనీకాంత్‌తో నటించే అవకాశం రావాలని ఆశిధాం. ఆమె కల కల్ల కాకుంటే సరి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: