ప్రభాస్ ఇంట పెళ్లి భాజా మోగనుందా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా బాహబలి మానియా పట్టుకుంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే కాదు యావత్ భారత దేశం..విదేశాల్లో కూడా బాహుబలి 2 ప్రభంజనం సృష్టిస్తుంది.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఐదు సంవత్సరాల్లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు తెరకెక్కాయి.  అయితే బాహుబలిగా నటించిన ప్రభాస్ అప్పటి వరకు స్టార్ హీరోగా ఉండేవాడు..కానీ బాహుబలి చిత్రం తర్వాత జాతీయ స్థాయి హీరోగా మారిపోయారు.  ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు.  

అయితే బాహుబలి సినిమా తీస్తున్న సమయంలో ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు వచ్చాయి.  టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచలర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ పేరు మాత్రమే. 35 ఏళ్ళు వచ్చిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా తన కెరీర్ పైనే ద్రుష్టిపెట్టాడు. కానీ బాహుబలి చిత్రం పూర్తి అయిన తర్వాత పెళ్లి..అంతే కాదు అప్పటి వరకు వేరే ఏ సినిమాల్లో కూడా ప్రభాస్ నటించలేదు.  

ఇక బాహుబాలి ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.  దీంతో ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ అని అందరూ చర్చించుకుంటున్నారు.  అంతే కాదు వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి జరగడం ఖాయమని అంటున్నారు జాతకాలు చెప్పేవాళ్ళు . ఇప్పుడు కొంతమంది అదే పనిగా ప్రభాస్ జాతకం చూస్తూ రకరకాల విషయాలు చెబుతూ వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్ కు పెళ్లి ఘడియలు ముంచుకొస్తాయి అని స్పష్టం చేసారు.

ప్రభాస్ పెద్దనాన్న కూడా పెద్ద ఎత్తున పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు.   ప్రభాస్ కూడా ఊ కొట్టాడు కాకపోతే బాహుబలి కంప్లీట్ కావాలి అన్నాడు ఇక ఇప్పుడేమో అడ్డు చెప్పడానికి మరో కారణం లేదు కాబట్టి ఈ ఏడాది వివాహ నిశ్చితార్థం , వచ్చే ఏడాది పెళ్లి ఖాయం అంటున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: