‘నిన్ను కోరి’ లో అమ్మాయిల గురించి నానీ ఎమన్నాడో తెలుసా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నానీ తర్వాత వచ్చిన సినిమాలతో పెద్దగా విజయం సాధించలేదు.  కానీ మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో సక్సెస్ సాధించిన నానీ ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నాడు.  తాజాగా  నేచుర‌ల్ స్టార్ నాని, డెబ్యూ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి చిత్రం తెర‌కెక్క‌గా, ఈ చిత్రం లో నివేదా థామస్ కథానాయికగా నటిస్తుంది. ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు.

వివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం జూన్ 23న విడుద‌ల కానుంది.  ఈ  చిత్ర ప్రోమో సాంగ్ ని విడుద‌ల చేయ‌గా, ఇందులోని విజువ‌ల్స్ ఆడియ‌న్స్ ని బాగా ఆకర్షించాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు.  ఈ టీజర్ లో నానీ ‘ ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాస్..అన్ని అలవాట్లు ఉన్నవాన్ని ప్రేమిస్తారు..ఏ అలవాట్లు లేనోన్ని పెళ్లి చేసుకుంటారు.’ ఈ డైలాగ్స్ ని బట్టి సినిమాలో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అన్నట్లు అర్థమవుతుంది.  

ఇప్పటికే ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నానీ ఈ సినిమాతో మరోసారి హిట్ కొడతాడని అంటున్నారు అభిమానులు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ వేడుక జ‌రుపుకోనుంది. గోపి సుంద‌ర్ నిన్ను కోరి చిత్రానికి సంగీతం అందించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: