పవన్ కి ఆ హీరో అంతబాగా నచ్చాడా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు పవన్ కళ్యాన్.  కేవలం సినిమాల్లో కాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఓ వైపు రాజకీయాలు మరో వైపు సినిమాల్లో నటిస్తూ పవన్ కళ్యాన్ ప్రస్తుతం తన ప్రాణ స్నేహితుడు.. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరంటే వెంటనే త్రివిక్రమ్ లేదా.. శరత్ మరార్ అని చెబుతారు.. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ హీరో వెంకటేష్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు... వీరిద్దరికీ జీవితం పట్ల ఆలోచన ధోరణి ఒకేలా ఉంటుందని.. ఆధ్యాత్మక విషయాలపై అవగాహన కూడా ఒకేలా ఉంటుంది అని అందుకే వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని సినీ వర్గాల వారు వ్యాఖ్యానిస్తూంటారు.

గతంలో ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించిన  విక్టరీ వెంకటేష్ మరోసారి పవన్ తో కనిపించబోతున్నాడట.  అయితే పవన్ కళ్యాన్ సాధారణంగా తన చిత్రంలో ఆ స్థాయి నటులను ఎవ్వరినీ కనీసం గెస్ట్ రోల్స్ కి కూడా ఒప్పుకోడని కానీ వెంకటేష్ విషయంలో మాత్రం కూల్ గా ఉండటం ఏంటీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్యారెక్టర్ నచ్చడంతో పాటు పవన్ సినిమా కావడంతో చేయడానికి ఒప్పుకున్నాడట వెంకీ. గతంలో విక్టరీ వెంకటేశ్ సినిమాలకు పనిచేసిన అనుభవం త్రివిక్రమ్ కు ఉంది.

ఆ అనుభవంతో తనదైన స్టయిల్ లో వెంకీ కోసం కొన్ని బలమైన సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగులు రాశాడట త్రివిక్రమ్. త్వరలోనే ఈ మేటర్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.  గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గోపాల గోపాల’ ఎంత గొప్ప విషయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో కూడా చాలా సన్నిహితంగా ఉంటారని సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: