ఫోటో ఫీచర్ : బుల్లెట్ పై ఘటోత్కచుడు భలే స్టిల్ ఇచ్చాడే..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం పాత తరం సినిమా ఎన్నో గుర్తుండియేలా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘మాయాబజార్’ చిత్రం..ఆ కాలంలోనే ఎన్నో గ్రాఫిక్స్ ఉపయోగించి సంచలనం సృష్టించారు.  ఈ చిత్రంలో మహానటులు అందరూ ఎంతో అద్భుతంగా నటించి ఆ సినిమాకే వన్నె తెచ్చారు. మాయాబజార్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది..ఘటోత్కచుడు. ఈ చిత్రంలో ఏన్ని పాత్రలు ఉన్నా ఘటోత్కచుడు పాత్రకు ఎంతో గొప్ప పేరు వచ్చింది.  

ఈ పాత్రలో నటించిన ఎస్వీ రంగారావు ఘటోత్కచుడు ఎంతో చక్కగా కుదిరారు.  ఎస్వీ రంగారావు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు.  ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.

బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు. ఎస్వీ రంగారావు అప్పట్లో తీయించుకున్న ఓ అపురూప చిత్రం మీకోం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: