‘దువ్వాడ జగన్నాథం’ కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  ఇప్పటికే పలు సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.  పూజా హెగ్డే అందాలు కుర్రకారు మతులు పోయాయి..ఇక దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ మంత్ర ముగ్ధులను చేస్తుంది.  ఈ చిత్రం రిలీజ్ ముందు నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.  

అయితే అన్ని అవరోదాలు దాటి ‘దువ్వాడ జగన్నాథం’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ముఖ్యంగా ఓవర్సీస్ లో 'డీజే' వసూళ్లు భారీగా ఉన్నాయి. యూఎస్ లో 300 స్క్రీన్లపై విడుదలైంది.  ఇక శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1800 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన డీజే అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ రాబట్టింది. బ‌న్నీ లాస్ట్ సూప‌ర్ హిట్ మూవీ స‌రైనోడును మించేలా డీజే ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టింది.

స‌రైనోడు ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే రూ.14 కోట్ల షేర్ రాబ‌డితే దువ్వాడ జగన్నాథమ్ 25 కోట్ల షేర్‌ కొల్లగొట్టింది.    ప్రీమియర్ షోల ద్వారా యూఎస్, కెనడాల్లో 4 లక్షల డాలర్ల మేర వసూలు చేసినట్లు సమాచారం.  


 ఇక డీజే ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.
నైజాం – 4.95 కోట్ల‌లో
సీడెడ్ – 2.7
ఉత్త‌రాంధ్ర – 1.94
ఈస్ట్ – 2.55
వెస్ట్ – 2.08
కృష్ణా – 1.03
గుంటూరు – 2.28
నెల్లూరు – 1.10
——————————————–
ఏపీ+తెలంగాణ షేర్ = 18.63 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: