నందమూరి అక్కినేనిలకు డీజేలో అవమానం !

Seetha Sailaja
‘దువ్వాడ జగన్నాథం’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు చూడని  భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టి బన్ని అభిమానులను జోష్ లో ముంచి వేస్తోంది. లాంగ్ వీక్ ఎండ్ కావడంతో ఈ కలెక్షన్స్ హవా మరో రెండు రోజులు కొనసాగే ఆస్కారం ఉంది. ఇప్పటికే ఈ సినిమా పై అనేక వివాదాలు వచ్చిన నేపధ్యంలో ఈ సినిమాలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావులకు  అవమానం జరిగింది అంటూ మరో కొత్త వివాదాన్ని తెర పైకి తీసుకు వచ్చారు.   

 వివరాలలోకి వెళ్ళితే ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రానికి హైలెట్ గా నిలిచిన సిటీ మార్ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డేలు  దుమ్ము రేపినా ఆ పాటలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ప్రస్తావించే పదాలు ఆ పాటలో ఉన్నాయి. ఆ పాటలో ఆ పదాలు వినడానికి బాగున్నా ఆ పాట చిత్రీకరణ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ అనుసరించిన వ్యూహం అక్కినేని నందమూరి అభిమానులు తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సిటీ మార్ పాటలో డాన్స్ చేస్తూ బన్నీ ఎన్టీఆర్ ఏఎన్నార్ మెగాస్టార్ అంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ మెగాస్టార్ ఫోటోలు ప్రత్యక్షం అవుతాయి. అయితే మహానటులు అక్కినేని నందమూరి ఫోటోలను సైడ్ లో చూపెట్టి మెగాస్టార్ చిరంజీవి ఫోటోను టాప్ భాగంలో హైలెట్ చేస్తూ చూపెట్టారు. ఇప్పుడు ఈ విషయం పై నందమూరి అక్కినేని అభిమానులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్త పరుస్తున్నారు.

దీనికితోడు ఈసినిమాలో పెళ్ళికి సంబంధించిన ఒక సీన్ లో ఆ పెళ్ళికి సంబంధించిన వంటల కాంట్రాక్ట్ ను తీసుకున్న అల్లు అర్జున్ ఈ కాంట్రాక్ట్ ను తనకు ఇచ్చిన యాంకర్ ఝాన్సీ పాత్రతో మాట్లాడుతూ పులిహోరలో ఇంగువ లేకుంటే రుచి ఉండదు అని అంటూ మధ్యలో అన్న ‘బెజవాడలో పైన అమ్మవారు క్రింద కమ్మవారు’ డైలాగ్ ను కమ్మ సామాజిక వర్గం వారు ఏమాత్రం హర్షించలేక పోతున్నారు అని తెలుస్తోంది.

అంతేకాదు కమ్మ సామాజిక వర్గ కుటుంబాలలో ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ అన్న డైలాగ్ కూడ కమ్మ సామాజిక వర్గంలోని చాలామందికి కోపాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాలలో అన్ని విషయాలలోనూ ప్రముఖమైన బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గాలలోని చాలామంది మనో భావాలను ‘డిజే’ దెబ్బ తీసినట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: