పూరి ట్వీట్.. నేను చాలా బిజీ..!

shami
టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాలో బాగా వినబడుతున్న పేరు టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్. పూరికి నోటీసులందాయని కొందరు.. పూరి ఒక్కడే కాదు అతని గ్యాంగ్ గ్యాంగ్ ఇందులో ఉన్నారని మరికొందరు అన్నారు. ఇక పూరి ఈ విషయంపై స్పందించలేదు కాబట్టి తన స్పందన ఇలా ఉంటుంది అని అనుకున్నారో ఏమో నేను అన్ని విషయాలు చెబుతా మీకు రాసే దమ్ముందా అని అన్నాడని సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.


తీరా ఈ విషయం పూరి దాకా వెళ్లడంతో తాను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని. ప్రస్తుతం తను పైసా వసూల్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నానని ట్వీట్ చేశాడు. అయితే స్టేట్మెంట్ వచ్చిన డ్రగ్స్ విషయమై మాత్రం ఏం మాట్లాడలేదు పూరి. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాస్త బిజీగా ఉన్నాను అంటూ ముగించేశాడు.


I have not given any statement regarding anything n anyone till now ..
very busy completing my film #PaisaVasool

— PURI JAGAN (@purijagan) July 15, 2017
అయితే పూరి డ్రగ్ ఎడిక్ట్ విషయంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడమే ఇక్కడ అసలు ట్విస్ట్. ఎవరేం అనుకున్నా తన పని తాను చేసుకుంటాననా లేక ఈ విషయంపై ఇప్పుడే ఏం మాట్లాడలేమనా ఎదో ఒక కారణం చేతే పూరి ఇలా సైలెంట్ గా మ్యాటర్ కు మ్యాచ అవ్వని ట్వీట్ చేసి కన్ ఫ్యూజ్ చేశాడు. అసలు మాట్లాడకుండా ఉందాం అంటే దమ్ముంటే రాస్కోండి అంటూ వచ్చిన కామెంట్స్ నిజమే అయ్యే అవకాశాలున్నాయి.  


అందుకే పూరి ట్వీట్ చేశాడు. కాని ట్వీట్ తో ఆగుతాడా లేక వివరణ ఇచ్చుకుంటాడా అన్నది చూడాలి. ఇక ఇదే విషయంపై చార్మి మాత్రం పైకి ఎదుగుతుంటే కింద్రకు లాగాలని చూస్తారు.. అంటూ ఏదో వేదాంతం అల్లేస్తుంది అమ్మడు.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: