సితార పుట్టినరోజున మహేష్ భావయుక్త ట్విట్ !

Seetha Sailaja
ప్రిన్స్ మహేష్ బాబు తన పిల్లలను విపరీతంగా ప్రేమిస్తాడు. అంతేకాదు   తాను ఎంతో బిజీగా ఉన్నా తన పిల్లలతో ప్రతిరోజు ఎంతోకొంత సమయం గడపకుండా అతడికి రోజు పూర్తికాదు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్  బాబుకు తన కుమార్తె సితార పట్ల ఒక సెంటిమెంట్ కూడ ఉంది. 

ఆమె పుట్టిన తరువాత  హీరోగా తన రేంజ్ మరింత పెరిగింది అనే నమ్మకం కూడ మహేష్ కు బాగా ఉంది. అందుకే తన ఇంటిలో ఒక మహాలక్ష్మి ఉంది ఆ మహాలక్ష్మి పేరే సితార. ఈరోజు సితార తన ఐదోవ ఏటన అడుగుపెడుతోంది అంటూ తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. 

అంతేకాదు ఈరోజు తన ముద్దుల కూతురు పుట్టినరోజు సందర్భంగా ఒక భావయుక్తమైన ట్విట్ కూడ చేసాడు. “నా కూతురు వలన నా జీవితం మరింత సంతోషంగా మారింది. నా ప్రతి రోజుని తను గొప్పగా మారుస్తుంది. ఈ రోజు నా బంగారం పుట్టిన రోజు సందర్భంగా తను మరింత ఆనందంగా ఉండాలని కోరుకుంటూ'' అంటూ ట్విట్ చేసి తన ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు మహేష్. వాస్తవానికి  సితార పుట్టినరోజునాడు ‘స్పైడర్’ సినిమా టీజర్ విడుదల  చేసే అవకాశం ఉంది అని భావించారు. కానీ ఆ విషయం చివరి నిమిషంలో క్యాన్సిల్  అయినట్లు తెలుస్తోంది.   

'స్పైడర్' సినిమాకు మరింత క్రేజ్ వచ్చే విధంగా ఈ ట్రైలర్ రూపొందించాలి అన్న ఉద్దేశంతో ఈరెండవ ట్రైలర్ ప్రయత్నం ప్రస్తుతానికి వాయిదా పడినట్లు టాక్. ఏది ఏమైనా తన కూతురు కోసం మహేష్ భావయుక్తంగా  ట్విట్ చేయడం ఈరోజు మహేష్ ఫ్యాన్స్ హాట్ టాపిక్.


She makes each day of mine special! Today is hers :) more love, infinite happiness to my little one on her special day. My daughter turns 5❤ pic.twitter.com/z2sb1IF4Vq

— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: