కాజల్ ను ఇలా కచ్చితంగా చూసి ఉండరు.. హాట్ లుక్స్ లో కేక పెట్టిస్తుంది..!

shami
క్రేజీ బ్యూటీ కాజల్ అగర్వాల్ కెరియర్ కు మరింత ఊపు తెచ్చిన పాట జనతా గ్యారేజ్ సినిమాలోని పక్కా లోకల్ సాంగ్. ఆ సాంగ్ ఏ ముహుర్తాన అమ్మడు ఒకే చేసిందో ఏమో కాని ఆమెను అదే రేంజ్ హాట్ లుక్ లో చూడాలనుకున్న ఎంతోమంది అభిమానుల కోరిక తీరిందని చెప్పొచ్చు. ఇక ఆ పాటలో కాజల్ ప్రతి కదలికను ఆస్వాదించేస్తున్నారు ఆమె అభిమానులు.


ఇంకా చెప్పాలంటే పక్కా లోకల్ అంటూ కాజల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ ను పిచ్చి వాళ్లను చేశాయంటే నమ్మాలి. అయితే సడెన్ గా ఇప్పుడు ఈ పాటలోని కాజల్ గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే జనతా గ్యారేజ్ సినిమా ఒరిజినల్ బ్లూ రే ప్రింట్ రిలీజ్ అయ్యింది. సినిమా మొత్తం ఒక ఎత్తైతే కాజల్ చేసిన పక్కా లోకల్ సాంగ్ ఒక ఎత్తు. మస్ ఆడియెన్స్ ను ఓ ఊపు ఊపేసిన ఈ సాంగ్ కాజల్ కెరియర్ లో చాలా స్పెషల్ అని చెప్పాలి.


ఇన్ని సినిమాలు చేసినా కాజల్ అందాలన్ని ఈ ఒక్క పాటలోనే బయట పెట్టిందని చెప్పొచ్చు. అంతేకాదు అందరి హీరోయిన్స్ కు క్యూట్ లుక్స్ తో హాట్ లుక్స్ మెయింటైన్ చేయడం కష్టం. అందులో కాజల్ మాత్రం కేక అని అంటున్నారు. ముఖ్యంగా ఆ సాంగ్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్  ఎనర్జీకి ఏమాత్రం తీసిపోకుండా కాజల్ ఎనర్జీ ఉంది. 


కాజల్ అభిమానులంతా పండుగ చేసుకునేలా కాజల్ ను చూసి వావ్ అని నోళ్లు వెళ్లబెట్టేలా పక్కా లోకల్ సాంగ్ వచ్చింది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తో కాజల్ ఒక్కసారిగా హాట్ ఐటం గాళ్ అయ్యిందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అందించిన కాజల్ పక్కా లోకల్ తర్వాత ఐటం సాంగ్స్ కు భారీ ఆఫర్లను అందుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: