సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారని వర్మ సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదీ అంటే వెంటనే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు అని చెబుతున్నారు.  నిజంగానే హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ముఠా పట్టుబడినప్పటి నుంచి టాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి.  ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులకు సిట్ నోటీసులు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో డైరెక్టర్ పూరి, కెమెరామాన్ శ్యామ్ కె.నాయుడు, నటుడు సుబ్బరాజు హాజరు కాగా ఈ రోజు హీరో తరుణ్ సిట్ ముందు హాజరయ్యారు.  అయితే టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ డ్రగ్స్ విషయంలో స్పందిస్తూ..గత కొన్ని రోజుల నుంచి డ్రగ్స్ విషయంలో టాలీవుడ్ ని టార్గెట్ చేయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు.  

అంతే కాదు ఈ డ్రగ్స్ కేసులో విద్యా, ఐటీ రంగాల్లో వ్యక్తులు కూడా ఉన్నారన్న విషయం పోలీసులే తెలిపారని కానీ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మీడియాలో చూపించడం లేదని కేవలం టాలీవుడ్ నే ఎక్స్ పోజ్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కేవలం అనుమానంతో విచారణకు పిలిచినంత మాత్రాన వారిని నేరస్తుల మాదిరిగా ట్రీట్ చేసి చూపించడం వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తదితరులకు నోటీసులు ఇచ్చి విచారించినట్లు స్కూల్ పిల్లలను కూడా 12గంటలపాటు విచారించగలరా? అని వర్మ ఎక్సైజ్ శాఖను ప్రశ్నించారు.  అంతే కాదు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయం కొత్తేమే కాదని ఇప్పటికే పలుమార్లు ఈ విషయం తెరపైకి వచ్చిందని కానీ ఈ సారి మాత్రం టాలీవుడ్ ని దెబ్బతీసే విధంగా చర్యలు జరుగుతున్నాయని అన్నారు.  

డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారి అకున్ సబర్వాన్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి రేంజిలో ప్రచారం కల్పిస్తోందని వర్మ అన్నారు. అంతేగాక, ఎస్ఎస్ రాజమౌళి.. అకున్ సబర్వాల్‌తో బాహుబలి3 చేయొచ్చు అంటూ సెటైర్లు వేశారు. 

రాంగోపాల్ వర్మ ట్విట్ :

#RGV about #Drugs in #Tollywood#Purijagannadh #subbaraju #Baahubali3 #SSR
RGV Mass 😎 pic.twitter.com/YkzmtLIc6T

— Prabhas 😍 (@SaiPrasadDrlng_) July 22, 2017 #RGV in Facebook pic.twitter.com/37xHASNI9L

— Danny (@urstrulyDharani) July 22, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: