కనపడకుండా వెళ్లిపోతానంటున్న అమితాబ్.. ఎందుకో తెలుసా..?

Vasishta

          బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు.తనను ఎంతోమంది కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నా... వారి విజ్ఞప్తిని కాదన్నాడు. ఇలాగే చేస్తే.. తాను కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతానని హెచ్చరించాడు. ఇంతకూ ఎందుకు వెళ్లిపోతానన్నాడు.?


          ఏం లేదండీ.. ఈ నెల 11వ తేదీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు. ఆరోజున ఫ్యాన్స్ ఎవరూ హంగామా చేయొద్దన్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్. తనకు హంగామా చేయడం ఇష్టముండదని.. అభిమానులెవరూ అలాంటి పనులే చేయొద్దని సూచించాడు. ఈసారి ఎవరూ తన పుట్టిన రోజు వేడుకలు చేయవద్దని చెప్పాడు. ఎవరైనా అలాంటి పనులు చేయాలనుకుంటే మానుకోవాలన్నాడు.


          అప్పటికీ వినకుండా హంగామా చేయాలని చూస్తే మాత్రం.. తాను ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపోతానన్నాడు. అప్పుడు తనను ఎవరూ కనుక్కోలేరన్నాడు. 75వ పుట్టినరోజు వేడుకలు కావడంతో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. వారి ఆశలపై అమితాబ్ నీళ్లు చల్లాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: