సరికొత్త ఇన్నింగ్స్ ఆడబోతున్న యువరాజ్..! తెలిస్తే షాక్..!!

Vasishta

ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టి సంచలనం సృష్టించిన యువరాజ్ సింగ్.. త్వరలో సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. క్రికెట్ మైదానంలో తన సమ్మోహనమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అలరించాడు యువరాజ్ సింగ్. క్యాన్సర్ ను జయింతి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన యువరాజ్.. ఇప్పుడు మైదానం వదిలి మరో కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.


          యువరాజ్ సింగ్ పేరు తెలీని క్రికెట్ అభిమానులు ఉండరు. పవర్ ఫుల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ కు యువరాజ్ చిరునామా. 6 బంతుల్లో 6 సిక్స్ లు కొట్టినప్పుడు యువరాజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా యువరాజ్ సత్తా చాటాడు. అయితే తాజాగా ఎంపికలో యువరాజ్ ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోయాడు. దీంతో యువరాజ్ ను తదుపరి సిరీస్ కు సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు.


          క్రికెట్ లో అవకాశాలు రాకపోవడంతో యువరాజ్ మరో ఇన్నింగ్స్ కు తెరదీసినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ సినిమాల్లోకి యువరాజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో షారూఖ్ ఖాను తో యువరాజ్ భేటీ కావడం ఇందుకు ఊతమిస్తోంది. ఇదే నిజమైతే ఈ స్టార్ బ్యాట్స్ మెన్ ను త్వరలోనే మనం బాలీవుడ్ స్క్రీన్స్ పై చూడొచ్చు.


          ఇప్పటికే జడేజా, శ్రీశాంత్ తదితరులు సిల్వర్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పటికే యువరాజ్ పలు ఫ్యాషన్ షోలలో తళుక్కున మెరిసాడు. మరి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై యువరాజ్ ఏమేరకు రాణిస్తాడో చూద్దాం. ఆల్ ది బెస్ట్ యువరాజ్.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: