సన్నీలియోన్ ను చూసి ఏడుస్తున్న స్టార్స్..! ఎవరో తెలుసా..?

Vasishta

          సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కొంతమంది స్టార్స్ ఏడుస్తున్నారు. సన్నీని చూసి స్టార్స్ ఏడవటమేంటి.. అనుకుంటున్నారా..? నిజమేనండీ ... మన ట్విట్టర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ మాట చెప్పాడు. సన్నీని ఫ్యాన్స్ చూపిస్తున్న నిజాయితీని చూసి కొంతమంది స్టార్స్ కుళ్లుకుంటున్నారట. ఇంతకూ ఆ స్టార్స్ ఎవరనేగా మీ డౌట్..?


          ఏం లేదండీ.. సన్నీలియోన్ రెండ్రోజుల క్రితం కేరళలోని కొచ్చి వెళ్లింది. అక్కడ ఓ షోరూమ్ ఓపెనింగ్ పాల్గొంది. అప్పుడు సన్నీలియోన్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ గుమికూడారు. ఓ దశలో ఆమె కారును మొత్తం చుట్టుముట్టేసి కదిలే పరిస్థితి లేకుండా చూశారు. ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి సన్నీలియోన్ తెగ సంబరపడిపోయింది.


          అయితే సన్నీలియోన్ పై ఫ్యాన్స్ చూపిన అభిమానాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో విధంగా అభివర్ణించారు. కేరళ ప్రజలు సన్నీలియోన్ పై అసాధారణమైన నిజాయితీ చూపించారని కొనియాడారు. వారి నిజాయితీని చూసి కేరళ  ప్రముఖ నటులైన మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటివారు ఏడుస్తున్నారని చెప్పారు. ఎందుకంటే వారికోసం ఎప్పుడూ ఇంతమంది జనం రాలేదంట.


          ఇదండీ రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం. ఇప్పుడు అర్థమైందిగా .. స్టార్ హీరోస్ సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఎందుకు ఏడుస్తున్నారో..? ఎంతైనా వెటకారంలో వర్మను మించినోడు ఎవరూ ఉండరేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: