సూపర్ స్టార్ కి ఘోర అవమానం..!

Edari Rama Krishna
ప్రపంచంలో ఆయన అంటే తెలియనివారు ఉండరు..యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు..కండల వీరుడు..అందగాడు,రాజకీయాల్లో కూడా తనదైన సత్తా చాటిన వ్యక్తి, కానీ కాలం కలిసి రాకపోతే వసుదేవుడు అంతటి వాడే..గాడిద కాళ్లు పట్టుకున్న పరిస్థితి నెలకొంది.  కొంత మంది మనుషుల క్రూర నైజానికి అంత గొప్ప వ్యక్తి ఘోర అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అనుకుంటున్నారా..! హాలీవుడ్ కండల వీరుడు సూపర్ స్టార్.. అర్నాల్డ్ స్క్వాజ్‌నెగర్.  

ఆయన సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పట్టేవారు..అంతే కాదు అప్పట్లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన ఆర్నాల్డ్.  అలాంటి గొప్ప నటుడు రోడ్డు పై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఒకప్పుడు కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన ఆర్నాల్డ్.. ఓహియోలో ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా హోటల్ నిర్వాహకులు అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఇక మీరు ఎప్పుడు వచ్చినా మా హోటల్ గదులు స్వాగతం పలుకుతూనే ఉంటాయి..మీకు స్పెషల్ విడిది ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  

దీంతో హోటల్ యాజమాన్యం ఇచ్చిన మాటను నమ్మిన అర్నాల్డ్.. ఇటీవల హోటల్‌లో బస చేసేందుకు వెళ్లారు. కానీ హోటల్ యాజమాన్యం ఆయనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. ఆర్నాల్డ్.. రూమ్ కావాలని అడగగా ఖాళీ లేవని చెప్పి పంపించారు. దీంతో షాక్ తిన్న ఆర్నాల్డ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.  

తనకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదని తెలిసి వారికి ఎలాగైనా బుద్ది చెప్పాలని..అక్కడే ఓ బ్లాంకిట్ కొనుక్కొని తన విగ్రహం ముందు నేలపై పడుకున్నారు ఆర్నాల్డ్.  ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. ఈ ఫోటోని సామాన్య నెటిజన్లే.. కాదు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
#ArnoldSchwarzenegger sleeping at entrance of Hotel which he Inaugurated when he was Governor,under his own Statue as he wasnot given room pic.twitter.com/Eomt7dSzNK

— | RAJAN | ராஜன் | (@rajangr_0811gr) August 20, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: